క్షమించమ్మా.. అంచనాలు అందుకోలేకపోయా: అమ్మాయి ఆత్మహత్య
విశాఖపట్నం: సిఎ పరీక్షల్లో ఓ సబ్జెక్టు తప్పడంతో మనస్తాపానికి గురైన అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. 'క్షమించమ్మా... అంచనాలు అందుకోలేకోపాయను.. అందుకే వెళ్లిపోతున్నాను..' అంటూ ఓ సిఎ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 'నా కోసమే నువ్వు కష్టపడుతున్నావు, అందుకే ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాను, లవ్ యూ అమ్మా.. అందరూ నన్ను క్షమించండి' అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది.
విశాఖపట్నంలోని సిపిఎం కాంపౌండ్ టింపనీ స్కూల్ సమీపంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. గణిశెట్టి సూర్యదుర్గ (19) బుల్లయ్య కళాశాలలో బికాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దానితో పాటు సిపి, సిపిటీ ప్రైవేట్ కళాశాలలో చార్టెడ్ అకౌంటెంట్ (సిఎ) కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఆమె తండ్రి నాగేశ్వర రావు ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి నాగమణి గృహిణి. సోదరుడు సిఎ చదువుతున్నాడు. వీరు సిబిఎం కాంపౌండులో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల విడుదలైన సిఎ పరీక్షా ఫలితాల్లో సూర్యదుర్గ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురైంది.
ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులను వేరే గదిలో పడుకోవాలని చెప్పి సూర్యదుర్గ తాను ముందు గదిలో నిద్రించింది. వేకువ జాము సమయంలో ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications