ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం, అరెస్ట్
అమరావతి: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై గుర్తు తెలియని ఓ ఆగంతకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెనుబల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలోని జలదంకి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పి. వెంకట రత్నం(30) బుచ్చిరెడ్డి పాలెం మండలం పెనుబల్లి గ్రామానికి వచ్చాడు. శనివారం రాత్రి ఆ గ్రామంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేయబోయాడు.

దీంతో వీరిద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. ఈ సమయంలో బాలిక ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో స్ధానికులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. దీంతో వెంకటరత్నం పరారయ్యాడు.
బాలిక కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డి పాలెం మండలంలోని పోలీస్ స్టేషన్‌లో నిందితుడు వెంకటరత్నంపై ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications