Godavari Pushkaralu: కుంభమేళాలా గోదావరి పుష్కరాలు-ఏపీ సర్కార్ నిర్ణయాలు..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను (godavari pushkaralu) మహాకుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఇవాళ సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం.. కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ఉప సంఘం భేటీ అయింది. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. వీటిపై ఐదు నిర్ణయాలు తీసుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ పుష్కరాలకు దాదాపు 8-10 కోట్ల మంది హాజరై పుష్కర స్నానం ఆచరించే అవకాశం ఉందని అంచనా వేశారు. 2027 జూన్ 26 - జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలు 6 జిల్లాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాలకు హాజరయ్యే భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.

Godavari Pushkaralu to be Kumbh Mela of the South Next Year AP Govt Finalizes 5 Plans

గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రోడ్లు, భవనాల శాఖ అత్యంత ప్రాధాన్యత కల్పించనుంది. వర్షాకాలంలో రహదారుల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వేసవిలో మెజార్టీ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టే విధంగా చర్యలు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అలాగే శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని కూడా నిర్ణయించారు. గతంలో జరిగిన పొరబాట్లు రిపీట్ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+