'మా ఊరి పేరులో వాస్తు దోషం ఉంది... మార్చండి'
విశాఖపట్నం: తమ ఊరి పేరులో వాస్తు దోషం ఉందని, వెంటనే పేరు మార్చాలంటూ గోకులపాడు గ్రామస్ధులు కోరుతున్నారు. వాస్తు దోషంగా కారణంగా ఊర్లో ప్రజలు వరుసగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఎక్కడుందీ ఆ ఊరు, పేరేమిటి అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని ఎస్. రాయవరం మండలంలోని గోకులపాడు అనే ఊరు ఉంది. రెండు రోజులు క్రితం ఈ ఊరికి సమీపంలోనే ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, పలువురికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇచ్చింది. పాయకరావు పేట ఎమ్మెల్యే అనితి మంగళవారం బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన గ్రామస్ధులు, తమ ఊరి పేరులో దోషం ఉందని, వెంటనే పేరు మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఊరిలో కూడా గత వారంలో పేలుడు ఘటన జరిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇలా వరుసగా గ్రామంలో పలువురు మరణిస్తుండటంతో గోకులపాడు గ్రామస్ధులు తమ ఊరి పేరుని మార్చాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications