విశాఖపట్నంకు శుభవార్త వినిపించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం వాసులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్తను అందించింది. విశాఖ రీజియన్ కు కొత్తగా 44 సూపర్ లగ్జరీ బస్సులు రాబోతున్నాయి. ఈ నెలాఖరుకు ప్రయాణికులకు ఇవి దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
తొలగించినవాటి పునరుద్ధరణ
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. దీంతో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం డిపోకు 11 సూపర్ లగ్జరీ బస్సులతోపాటు ఒక ఆల్ట్రా డీలక్స్ బస్సు వచ్చాయి. మరో 33 సూపర్ లగ్జరీ బస్సులు రానున్నాయి. కొత్త బస్సులను అంతర్రాష్ట సర్వీసులుగా నడిపించాలని అధికారులు నిర్ణయించారు. భీమవరం, విజయవాడ, తిరుపతి, కడప, శ్రీశైలం, శ్రీకాకుళం, పలాస, హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోరాపుట్, రాజమండ్రి, కాకినాడ, పర్లాకిమిడి, ఖమ్మం, నల్గొండ, భద్రాచలం వంటి ప్రాంతాలకు వీటిని తిప్పనున్నారు. తొలగించిన బస్సులకు మరమ్మత్తులు నిర్వహించడంతోపాటు పూర్తిగా ఆధునికీకరించి తిప్పబోతున్నారు.

తెనాలి నుంచి బెంగళూరువైపునకు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసి డిపో కు కొత్తగా స్టార్ లైనర్ బస్సులు వచ్చాయి. ఇవి పూర్తిగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు. వీటిని హైదరాబాద్ కు, విశాఖపట్నంవైపునకు సూపర్ లగ్జరీ బస్సును తిప్పనున్నారు. స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొత్త బస్సులను ప్రారంభించారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలి డిపోలో కూడా కొత్త బస్సులను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. వీటిని తెనాలి నుంచి బెంగళూరుకు, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు తిప్పుతారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరగా అన్నింటిని మంత్రితో చర్చించి ఆర్టీసీ విలీనం ప్రభుత్వంలో సంపూర్ణంగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications