ఏపీలో యువతకు శుభవార్త.. ఆ ఫెలోషిప్ తో నెలకు 19వేలు సంపాదించండి.. హర్రీఅప్!

ఏపీలో యువతకు ఎస్బిఐ శుభవార్త చెప్పింది. భారతదేశంలోని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలనుకునే యువతకు ఎస్‌బీఐ ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. 'ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్' ద్వారా, యువతకు బ్రహ్మాండమైన అవకాశాన్ని కల్పిస్తోంది ఎస్బిఐ. యువత గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడానికి, అక్కడి సమస్యలను అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.

13నెలల పాటు ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్

ఎస్బిఐ అందించే ఈ ఫెలోషిప్ కార్యక్రమం 13 నెలల పాటు సాగుతుంది. ఈ ఫెలోషిప్ గ్రామాలలోని స్థితిగతులను ప్రజల సమస్యలను ఎన్జీవోలతో కలిసి అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడినది. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చాలని ఆసక్తి ఉన్న 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వయసు గల యువత ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Good news for ap youth The SBI Youth for India Fellowship offers to earn upto 19 000 per month

నెలకు 16 వేల రూపాయల స్టైఫండ్

ఈ ఫెలోషిప్ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం బ్యాచిలర్ డిగ్రీ అయిన పూర్తి చేసి ఉండాలి. ఈ ఫెలోషిప్ కి ఎంపికైన వారికి నెలకు 16 వేల రూపాయల స్టయిఫండ్ అందిస్తారు. అదనంగా ట్రావెలింగ్ అలవెన్స్ 2000 రూపాయలు, ప్రాజెక్టు ఖర్చుల కోసం వెయ్యి రూపాయలను కేటాయిస్తారు.

వారికి 50వేల రూపాయలు రీ అడ్జస్ట్మెంట్ అలవెన్స్

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి 50వేల రూపాయలు రీ అడ్జస్ట్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఈ ఫెలోషిప్ లో అర్హత సాధించాలంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హులైన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన వారికి ఫెలోషిప్ ఇస్తారు. ఇందులో భాగంగా గ్రామీణ సేవలో పాలుపంచుకునే అవకాశం వీరికి లభిస్తుంది.

12 అంశాలపైన ప్రాజెక్ట్ లు

ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణజీవనోపాధి, మహిళాసాధికారత వంటి 12అంశాలపైన ఎస్బిఐ ఫౌండేషన్ ద్వారా అందించే ఈ ఫెలోషిప్ లో ప్రాజెక్టులు ఉంటాయి.డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఎస్బిఐ అందించే ఈ ఫెలోషిప్ ను అస్సలు వదులుకోవద్దు. ఆసక్తిగల అభ్యర్థులు గూగుల్‌లో "www.sbi youth for india fellowship 2026" అని టైప్ చేసి, ఆ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఫెలోషిప్ తో ఆదాయం, గ్రామానికి సేవ చేసే భాగ్యం

వెబ్‌సైట్‌లో 'లాగిన్ నౌ' ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్ దరఖాస్తును పూరించాలి. ఇక దరఖాస్తు ప్రక్రియలో అడిగిన వివరాలను దశలవారీగా నమోదు చేయాలి. అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేస్తే కంగ్రాట్స్ మీరు అర్హత సాధించారు అనే సందేశం స్క్రీన్ పైన వస్తుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ అసైన్మెంట్ ఉంటుంది. ఆపై అర్హులైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారు ఫెలోషిప్ ని అందుకోవడమే కాక గ్రామానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+