తిరుపతికి వరం ప్రకటించిన నరేంద్రమోడీ

పాఠశాలలకు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. సెలవులు రాగానే ఎక్కువమంది కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొగ్గుచూపుతారు. తిరుపతి వెళ్లే ఏ రైలు చూసినా రిజర్వేషన్ దొరకడం కష్టమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తిరుమల భక్తుల కోసం ప్రత్యేక రైలును ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ఒక్కో సర్వీస్ చొప్పున ఈ రైలు అందుబాటులోకి వచ్చింది.

నెంబర్ 07489 రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మే 11వ తేదీన అందుబాటులో ఉంటుంది. రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయిచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

Good news for Indian Railways Special trains from Tirupati to Secunderabad

నెంబర్ 07490 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మే 13వ తేదీన అందుబాటులో ఉంటుంది. రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మౌలాలి స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైళ్లతోపాటు మరికొన్ని ప్రత్యేక రైళ్లను కూడా అధికారులు ప్రకటించారు. నెంబర్ 07009 రైలు మే 10వ తేదీన మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు అందుబాటులో ఉంటుంది. మే 11న నెంబర్ 07250 రైలు సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు అందుబాటులో ఉంటుంది. మే 13వ తేదీన నెంబర్ 07057 రైలు కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు అందుబాటులో ఉంటుంది.

నెంబర్ 06227 యశ్వంత్‌పూర్ నుంచి బీదర్‌ వరకు నడిచే రైలు మే 6వ తేదీన అందుబాటులో ఉంటుంది. నెంబర్ 06228 బీదర్ నుంచి యశ్వంత్‌పూర్ వరకు నడిచే రైలు మే 7వ తేదీన అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+