జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్- 7 నెలల్లో రూ.40361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు..
ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం లేదని, సంస్ధలు రావడం లేదని, పెట్టుబడులు పెట్టడం లేదన్న విపక్షాల విమర్శలకు చెక్ పడింది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. తాజాగా గత ఏడునెలల్లోనే భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల సంఖ్య అక్షరాలా రూ.40361 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడులు కూడా గత 7నెలల్లోనే రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో భారతదేశానికి పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తోంది. 2022 సంవత్సరానికి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్ గా నిలిచింది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే రూ. 40,361 కోట్ల పెట్టుబడులు రావడంతో ఏకంగా దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది.

ఇక్కడ మరోవిశేషం కూడా ఉంది. ఈ ఏడాది దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం ఏపీతో పాటు ఒడిశా సాధించాయి. గత ఏడునెలల్లో ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలను డీపీఐఐటీ తాజా నివేదిక వెల్లడించింది.
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) నివేదిక ప్రకారం భారత్ కు రూ. 1,71,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.భారతదేశ పారిశ్రామిక పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ రూ. 40,361 కోట్లు ఆకర్షించి అగ్రస్థానంలో నిలవగా, ఒడిశా రూ.36, 828 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏపీ క్యాబినెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో ఎస్ఐపీబీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించునుంది.












Click it and Unblock the Notifications