'తల్లికి వందనం'పై చంద్రబాబు శుభవార్త ... అకౌంట్‌లోకి రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తల్లిక వందనం పథకానికి సంబంధించి రూ.6487 కోట్లు కేటాయించారు. దీనికింద ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ.15వేల చొప్పున అందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు.

కుటుంబంలో ఎంతమంది ఉన్నా సాయం
జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమ్మ ఒడి పేరుతో అమలు చేసింది. తాజాగా తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏడాదికి రూ.15వేల చొప్పున విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేస్తారు. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులన్నా ఒక్క విద్యార్థికి మాత్రమే సాయం అందుతుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. విదివిధానాలు రాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వీటిని జమచేయనున్నారు.

good news for students AP government Rs 6487 crore allocated for talliki vandanam scheme in state budget

నైపుణ్యం పెంచేందుకు రూ.కోట్ల ఖర్చు
రాష్ట్రంలో చదువుకున్న యువత నైపుణ్యం పెంచేందుకు, వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు, సాంకేతిక విద్యకు సంబంధించి రూ.1235 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం కంటే అదనంగా రూ.1527 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి జన్ వికాస్ కింద వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధి శాఖ సమగ్రమైన నివేదికను రూపొందించింది. ఎక్కడెక్కడ ఏయే తరహా కళాశాలలు అవసరమవుతాయి? ఎక్కడ ఉపాధి అవకాశాలున్నాయి? తదితర విషయాలతోపాటు చదువుకునే సమయంలోనే నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేలా నిబంధనలు రూపొందించబోతున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా విద్యార్థులు ఎక్కడా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+