రాజధాని అమరావతికి శుభవార్త.. ఆ రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్.. కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కేంద్రం నుండి కావలసిన సహాయాన్ని తీసుకుంటూ ఏపీ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకున్న కేంద్రంలోని అధికార బీజేపీ కూడా ఏపీ పైన ప్రధాన దృష్టిని కేంద్రీకరించి సీఎం చంద్రబాబుకు సహకరిస్తోంది.
ఏపీకి రైల్వే శాఖ శుభవార్త
విభజన తర్వాత ఏపీలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, రైల్వే లైన్ నిర్మాణం పైన పనులను వేగవంతం చేశారు. ఇక ఈ క్రమంలోనే ఏపీకి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

భూసేకరణ నోటిఫికేషన్
అమరావతి మీదుగా నిర్మించనున్న రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం మొత్తం 77ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నగరం మీదుగా 56.53కిలోమీటర్ల పొడవైన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం గతంలోనే ప్రతిపాదనలు రాగా, ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఈ రైల్వేలైను ఏర్పాటు చేయడానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ గ్రామాలలో భూసేకరణ
ఈ ప్రాజెక్టు కోసం ఇబ్రహీంపట్నం మండలంలో 77.154 ఎకరాల భూమిని సేకరించడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. దీనికి సంబంధించి శనివారం అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ భూసేకరణ ద్వారా రెండు గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తారు. చిలుకూరు గ్రామంలోని 59 సర్వే నెంబర్ పరిధిలో 26.02 ఎకరాలు, దాములూరు గ్రామంలోని 22 సర్వే నెంబర్ లో 51. 134 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరిస్తారు.
కొత్త రైల్వే లైన్ రాజధాని అమరావతికి కీలకం
ఈ భూసేకరణపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని విజయవాడ ఆర్డీవోకు లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే అభ్యంతరాలు ఉన్నచోట ఆర్బిట్రేషన్ నిర్వహించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ కొత్త రైల్వే లైను రాజధాని అమరావతికి కీలకంగా మారనుంది. ఈ రైల్వే కనెక్టివిటీ ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభం
ఈ రైల్వేలైన్ కోసం భూసేకరణ పూర్తి చేసి, పరిహారం అందజేయడం జరిగిపోతే ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. త్వరలోనే రైల్వే లైను నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ప్రజలు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications