రాయలసీమకు వరం ప్రకటించిన నరేంద్రమోడీ

రాయలసీమవాసులకు రైల్వేశాఖ తియ్యటి శుభవార్తను వినిపించింది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ సిటీ భగత్‌కీకోటీ (06181) వరకు ప్రత్యేక రైలు నడుస్తోంది. దీన్ని ఏపీలోని కడప మీదగా నడపనున్నారు. ఈనెల 14,21, 28, ఏప్రిల్ 4 తేదీల్లో.. కోయంబత్తూరు నుంచి భగత్ కీ కోటి వరకు, అలాగే తిరుగు ప్రయాణంలో (06182) ఈనెల 17, 24, 31, ఏప్రిల్ 7తేదీల్లో భగత్ కీ కోటి నుంచి కోయంబత్తూరు వరకు ఈ రైళ్లు నడుస్తాయి.

కోయంబత్తూరులో ప్రతి గురువారం అర్ధరాత్రి 2.30గంటలకు బయల్దేరి కడపకు మధ్యాహ్నం 1.55గంటలకు, ఎర్రగుంట్లకు 2.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి గుత్తి, డోన్, కాచిగూడ, నాందేడ్, అహ్మదాబాద్ మీదగా భగత్ కీ కోటి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు ఎర్రగుంట్ల, 6.00 గంటలకు కడప స్టేషన్లకు చేరుకుంటుంది. తర్వాతరోజు ఉదయం 9.30 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

good news special trains between coimbatore to bhatat ki koti

రోజురోజుకు ప్రయాణికుల రద్దీ తీవ్రమవుతుండటంతోపాటు సరిపడా రైళ్లు అందుబాటులోకి లేకపోతుండటంతో శరవేగంగా కొత్త రైళ్లను రైల్వేశాఖ సమకూర్చుకుంటోంది. 2027కల్లా వెయిటింగ్ లిస్టు లేకుండా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అందుబాటులోకి తేవాలనే నిశ్చయంతో అధికారులున్నారు. అందుకనుగుణంగా కొత్త రైళ్లను సమకూర్చుకోవడంతోపాటు ఉన్న రైళ్లను ఆధునికీకరిస్తున్నారు. స్లీపర్ బోగీలను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను ఎక్కువగా తీసుకువస్తుండటంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో నాన్ ఏసీ స్లీపర్ బోగీలతో అమృత్ భారత్ రైళ్లను నడపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+