శుభవార్త: తిరుపతి నుండి ఆధ్యాత్మిక కేంద్రాలకు, విదేశాలకు విమాన సర్వీసులు.. ఎప్పుడంటే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన తిరుపతి నుండి తక్కువ సమయంలో సందర్శించే అవకాశం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు త్వరలోనే విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.

ఆధ్యాత్మిక కేంద్రాలకు, విదేశాలకు విమాన సర్వీసులు

తిరుపతి నుండి దేశంలోని వివిధ ఆధ్యాత్మిక స్థలాలకు విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి శ్రీకాళహస్తి లో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాట్లాడిన ఆయన తిరుపతి నుండి దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు విదేశాలకు కూడా సర్వీసులు నడిపిస్తామని తెలిపారు.

Good news to tirumala devotees Flight services from Tirupati to spiritual centers and abroad soon

అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించే ప్లాన్

ముఖ్యంగా తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉందని రేణిగుంట విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతేకాదు కేంద్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విమానయాన శాఖకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు కూడా చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఏవియేషన్ రంగంలో ఏపీ అగ్రభాగంలో ఉండేలా ప్లాన్

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర విమానయాన శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంతో పాటు, కొత్త విమాన సర్వీసులతో ఏవియేషన్ రంగంలో ఏపీని అగ్రభాగాన నిలబెట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.

ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం), తిరుపతి, కడప, కర్నూలు (ఓర్వకల్), రాజమండ్రి విమానాశ్రయాలు సేవలను అందిస్తున్నాయి. మరోవైపు భోగాపురం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం జూన్ 2026 నాటికి పూర్తికానుంది. ఇవి కాకుండా కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెం, ఒంగోలు, శ్రీకాకుళం, తుని-అన్నవరం, నాగార్జున సాగర్ వంటి ప్రదేశాలలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+