ప్రియురాలిని నమ్మించి గొంతుకోసి చంపాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

చీరాల: ప్రకాశం జిల్లా పాత చీరాలకు చెందిన ఎంటెక్ విద్యార్థిని తేజను ప్రేమికుడు గోపిచంద్ గొంతుకోసి శనివారం రాత్రి హత్య చేశాడు. గోపిచంద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.చీరాలలోని టీవీఎస్ షోరూంలో తేజ పనిచేస్తోంది.

ప్రకాశం జిల్లా పాత చీరాలకు చెందిన తేజ, రామానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గోపిచంద్‌తో రెండేళ్ళుగా ప్రేమించుకొంటున్నారు.

ఈ క్రమంలో గోపిచంద్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో తేజను రామానగర్‌లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుక నుండి తలుపును పగులగొట్టి లోనికి వెళ్ళారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో అర్ధం కాలేదు.

Gopichand kills his lover Teja in Prakasham district

తేజను గొంతుకోసి గోపిచంద్ పారిపోయాడు. ఈ విషయాన్ని గోపిచంద్ తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. గోపిచంద్ స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. రెండేళ్ళుగా ప్రేమించుకొంటున్న వారిద్దరి మధ్య ఏం జరిగిందో అర్ధం కావడం లేదంటున్నారు స్నేహితులు. తేజను చంపాల్సిన మనస్పర్థలు కూడ వారి మధ్య లేవంటున్నారు గోపిచంద్ సన్నిహితులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gopichand killed his lover Teja on Saturday night at Ramanagar in Prakasham district.Gopichand and Teja lovers, police registered case, searching for Gopichand.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి