ఎన్టీఆర్ పేరు: శంషాబాద్‍పై అశోక్, తప్పులేదని వెంకయ్య
న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో చెప్పిన మరుసటి రోజే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ఆ దిశలో అడుగులు వేస్తామని ప్రకటన చేశారు. శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడతామని అశోక చెప్పారు. ఆ డిమాండులో ఎలాంటి తప్పులేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మద్దతు పలకడం గమనార్హం.
హైదరాబాద్‌లోని శంషాబాద్ దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా పేరు మార్చిందని, ఇప్పుడు దానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని అశోక్ గజపతి రాజు గురువారం స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన తన శాఖ బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉండేదని, దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చాలని నిర్ణయించినప్పుడు, మార్చొద్దని ఆందోళన చేసిన వారిలో తానూ ఒకడినని అయితే, తానే పౌరవిమానయాన శాఖ మంత్రినవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.

ఇప్పుడు దేశీయ విమానాశ్రయానికి పేరు మార్చే అవకాశం వచ్చినందున కచ్చితంగా ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణతోసహా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం పేరును ఎన్టీఆర్ నుంచి రాజీవ్ గాంధీకి మార్చినప్పుడు తాము వ్యతిరేకించామని, ఎన్టీఆర్ పేరును అలాగే ఉంచాలని డిమాండ్ చేశామని, గతంలో చేసిన డిమాండును నెరవేర్చుకునే అవకాశం వచ్చినందున సహజంగానే ఎవరైనా దానిని పూర్తి చేసుకుంటారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ విమర్శలను తాను పట్టించుకోనని, ఎన్టీఆర్ పేరు ఉండాలని తెలుగువారు కోరుకుంటున్నారని చెప్పారు. తాము కొత్త పేరు పెట్టడం లేదని, ఉన్న పేరును పాత ప్రభుత్వం మార్చడం వల్లే ఇప్పుడు సమస్య వచ్చిందన్నారు.
వెంకయ్య మద్దతు
హైదరాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరే ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆ నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తాను కూడా ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన యూపిఏ ప్రభుత్వం దానిని మార్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, దానిపై చర్చించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications