విశాఖ తాకట్టు.. అసెంబ్లీలో రీల్స్ వేసిన చంద్రబాబు

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. జగన్ సర్కార్ పాలనలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న లోపాలను తవ్వి తీస్తోంది.

ఈ క్రమంలో సాగరనగరం విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టారని అన్నారు. అందుకే ఆ పార్టీకి మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.

Government properties worth Rs 1914 Cr mortgaged to the Bank by the YS Jagan regime

వైఎస్ జగన్ హయాంలో విశాఖపట్నంలో ఏయే ప్రభుత్వ కార్యాలయాల భవనాలను ఎంత మేర తాకట్టు పెట్టారనే విషయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. అడ్డు అదుపు లేకుండా, తమ ఇష్టానుసారంగా 1,914 కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారంటూ మండి పడ్డారు.

24 ఎకరాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనం- రూ. 359 కోట్లు, 30 ఎకరాల డెయిరీ ఫామ్- రూ. 309 కోట్లు, 17 ఎకరాల ప్రభుత్వ ఐటీఐ- రూ.270 కోట్లు, తొమ్మిది ఎకరాల పోలీస్ క్వార్టర్స్- రూ. 215 కోట్లు, దివ్యాంగుల సంక్షేమ శాఖకు చెందిన 19 ఎకరాల శిక్షణ- ఉత్పత్తుల కేంద్రం- రూ. 157 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టినట్టు చంద్రబాబు వివరించారు.

అలాగే 10 ఎకరాల జల వనరుల అభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బంగళా- రూ.203 కోట్లు, మూడు ఎకరాల ఆర్ అండ్ బీ క్వార్టర్స్- రూ. 99 కోట్లు, 4 ఎకరాల ఎంవీపీ కాలనీ రైతు బజార్- రూ. 90 కోట్లు, మూడు ఎకరాల సర్కుట్ హౌస్- రూ.81 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిందని అన్నారు.

Government properties worth Rs 1914 Cr mortgaged to the Bank by the YS Jagan regime

వాటితో పాటు.. నాలుగు ఎకరాల్లో నిర్మించిన పీడబ్ల్యూడీ కార్యాలయ భవనం- రూ. 79 కోట్లు, ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెరికల్చర్- రూ 47 కోట్లు, సీతమ్మ ధార తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని 34 కోట్ల రూపాయలకు జగన్ ప్రభుత్వం వివిధ బ్యాంకులకు తాకట్టు పెట్టినట్లు చెప్పారు.

విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణమని, ఆ పార్టీ అభ్యర్థులకు విశాఖపట్నం ఓటర్లు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. 40 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను కూడా వాళ్లు ఆక్రమించుకున్నారని, వాటన్నింటినీ విడిపిస్తామని హామీ ఇచ్చారు. భూ ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+