Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభుత్వ నిర్ణయం పై గవర్నర్ అసంతృప్తి - దిద్దుబాటు కోసం మల్లగుల్లాలు : హైకోర్టు వ్యాఖ్యలతో...!!

ఏపీ ప్రభుత్వం రుణ ఒప్పందంలో తన పేరు వాడటం పైన గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులు, ఆర్థిక రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న గ్యారంటీ ఒప్పందంలో వ్యక్తిగతంగా తన పేరు చేర్చడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో...ప్రభుత్వం నుంచి గవర్నర్ కు వివరణ ఇచ్చుకొనేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటుగా ఆర్దిక శాఖ ఉన్నతాధికారులు సైతం రాజభవన్ కు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదే అంశం పై హైకోర్టు అభ్యంతరం

ఇదే అంశం పై హైకోర్టు అభ్యంతరం


తాజాగా హైకోర్టు సైతం ఇదే నిర్ణయం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో..ఈ వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పందాలు చేసుకోవటంతో..వాటిల్లో గవర్నర్ పేరును తొలిగించి..కొత్తగా ఒప్పందాలు చేసుకోవాలా... గవర్నర్ పేరు లేకుండా ఒప్పందం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశం పైన చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకు అధికారులతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రానికి గవర్నర్ అధిపతి. ప్రభుత్వ కార్యకలాపాలను గవర్నర్ తరపు ప్రభుత్వం నిర్వహిస్తుంది.

గవర్నర్ పేరు ప్రస్తావనతో సమస్య

గవర్నర్ పేరు ప్రస్తావనతో సమస్య

గవర్నర్‌ అన్న వ్యవస్థ ముఖ్యం తప్ప, ఆ పదవిలో ఎవరున్నా వారి పేరును ప్రస్తావించరు. ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గవర్నర్‌' అని మాత్రమే ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన పోస్టులకు సంబంధించిన నియామక ఉత్తర్వుల్లో మాత్రమే గవర్నర్‌ పేరును వ్యక్తిగతంగా వాడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో చేసుకున్న గ్యారంటీ ఒప్పందంలో, అది కూడా నోటీసులివ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి అన్నచోట... బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అని వ్యక్తిగతంగా గవర్నర్‌ పేరు రాయడం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది.

దిద్దుబాటు చర్యల్లో అధికారులు

దిద్దుబాటు చర్యల్లో అధికారులు

తాజాగా హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ నిధుల రుణాల అంశం పైన దాఖలైన కేసుల విచారణ సమయంలోనూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌ పేరుతో చేసుకున్న ఇలాంటి ఒప్పందం చెల్లకపోవచ్చని పేర్కొంది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం దావాలు, క్రిమినల్‌ కేసుల నమోదు నుంచి గవర్నర్‌కు రక్షణ ఉందనే విషయాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    రాజ్ భవన్ కు అధికారుల వివరణ

    రాజ్ భవన్ కు అధికారుల వివరణ

    ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో గ్యారంటీ ఒప్పంద పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతకాలు పెట్టాల్సిన ప్రతి చోటా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అని రాసి, దాని కింద ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సిహెచ్‌.వి.ఎన్‌.మల్లేశ్వరరావు సంతకాలు చేశారు. ఆ ఒప్పందం 19వ పేజీలోని షెడ్యూల్‌-3లో నోటీసు ఇచ్చేందుకు చిరునామా అన్న చోట మాత్రం... బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, కేరాఫ్‌ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఏపీ సెక్రటేరియేట్‌ అని రాశారు. సాధారణంగా నోటీసు ఎవరికివ్వాలి అన్న చోట... ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ పేరు మాత్రమే రాస్తారని, వ్యక్తిగతంగా గవర్నర్‌ పేరు రాసే సంప్రదాయం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..గవర్నర్ ఈ వ్యవహారం పైన అసంతృప్తి వ్యక్తం చేయటంతో..దీనిని సరి చేసుకొనేందుకు ప్రభుత్వంలోని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+