బాబు, నేను కెప్టెన్లమే, కానీ: గవర్నర్ అసహనం, లోకేష్‌తో పరిచయం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తాను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లేయింగ్ కెప్టెన్ అని గవర్నర్ నరసింహన్ గురువారం నాడు వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించారు.

తాత్కాలిక సచివాలయం ఐదో భవనం వద్ద గవర్నర్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సచివాలయాన్ని పరిశీలించిన అనంతరం గవర్నర్ మాట్లాడారు. కొత్త రాజధాని అయినందున కొన్ని సమస్యలు ఉంటాయని, సమస్యలను అర్థం చేసుకొని అమరావతి వస్తున్నందుకు ఉద్యోగులకు అభినందనలు చెబుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పని చేసేందుకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తోందన్నారు.

Governor Narasimhan praises AP CM Chandrababu

పుష్కర పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పాత్ర అభినందనీయమని కితాబిచ్చారు. రాజధాని అమరావతిలో తనకు కూడా (గవర్నర్ భవన్) కొంత స్థలం కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు.

నేను తెలంగాణకే పరిమితమయ్యానన్నది మీడియా సృష్టి అన్నారు. ఏపీ, తెలంగాణ సమస్యల పైన ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇరువురు సమస్యలను పరిష్కరించుకుంటారన్నారు. తాను సచివాలయానికి రావడం తప్పేం కాదని వ్యాఖ్యానించారు.

హైకోర్టు విభజనపై నో, అసహనం!

హైకోర్టు విభజన పైన గవర్నర్ నరసింహన్‌ను విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన నో కామెంట్ అన్నారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టినందున అన్ని విషయాలు పరిష్కరిస్తామని చెప్పారు. విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు గవర్నర్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కావాలసిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇంటికొచ్చిన గవర్నర్‌కు లోకేష్‌ను పరిచయం చేసిన బాబు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం నిమిత్తం బెజవాడలో గవర్నర్ నరసింహన్ బస చేసిన హోటల్‌కు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆ తర్వాత గవర్నర్‌ను కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా పసందైన విందు ఇచ్చిన చంద్రబాబు.. తన తనయుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పరిచయం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Governor Narasimhan praises AP CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి