ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్ కీలక భేటీ..!!
ఏపీ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శనివారమే ఆయన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
అమరావతి: ఏపీ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన కోసం ఆయన శనివారమే ఢిల్లీకి వెళ్లారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
శుక్రవారం అబ్దుల్ నజీర్ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇదివరకు ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నగవర్నర్ కు విమానాశ్రయంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ అదనపు కమిషనర్ హిమాన్షు కౌశిక్ స్వాగతం పలికారు. ఏపీ భవన్ లో గార్డ్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. అనంతరం ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ ను కలుసుకున్నారు.

ఈ ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలిశారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు వారిద్దరూ భేటీ అయ్యారు. ఇది మర్యాదపూరక సమావేశంగా చెబుతున్నారు. బాధ్యతలను స్వీకరించిన తరువాత గవర్నర్లు సాధారణంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా- ప్రధాని మోదీతో భేటీ తరువాత అబ్దుల్ నజీర్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ ఆయన సమావేశం కానున్నారు.

శుక్రవారం అబ్దుల్ నజీర్ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇదివరకు ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Click it and Unblock the Notifications