హరీష్‌ని గుర్తుచేసి,కెసిఆర్‌తో గవర్నర్ పవర్ చమత్కారం
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర నేతలు భేటీ సమయంలో ఆసక్తికరమైన చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. గవర్నర్‌ను కలిసిన తెరాస చీఫ్, ఇతర నేతలు తెరాస శాసన సభ్యుల తీర్మానాన్ని గవర్నర్‌కు ఇచ్చారు. టిఆర్ఎస్ శాసన సభ్యులు కెసిఆర్‌ను నాయకుడిగా ఎన్నుకున్నారు. దీనిని గవర్నర్‌కు అందజేశారు.
ఈ సమయంలో గవర్నర్, తెరాస నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగిందట. ఈ భేటీకి తెరాస సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కాలేదు. హరీష్ రావు లేకపోవడాన్ని గవర్నర్ గుర్తించారు. హరీష్ రావును గుర్తు చేశారు. అదే సమయంలో ఉద్యమం సమయంలో గవర్నర్ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలను గుర్తు చేశారు.

దానికి సీనియర్ నేత కె కేశవ రావు స్పందించారు. ఉద్యమం సమయంలో తాము చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకోవద్దని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కెసిఆర్... తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడనుందని, కొత్త పవర్ ప్రాజెక్టుల కోసం సహకరించాలని కోరారు. దానికి స్పందించిన గవర్నర్... పవర్ మీ చేతిలోనే ఉందంటూ చమత్కరించారు. కాగా, తెలంగాణలో తెరాస 63 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్దమవుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications