జగనా, పవన్ కళ్యాణ్.. ఎవరి ఎఫెక్ట్: గ్రూప్ 2 మెయిన్స్‌పై తగ్గిన ప్రభుత్వం

ఎట్టకేలకు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది. గ్రూప్ 2 మెయిన్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

విజయవాడ: ఎట్టకేలకు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది. గ్రూప్ 2 మెయిన్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సిలబస్ మార్పు కారణంగా అభ్యర్థులకు గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

తమకు సిలబస్ మారిందని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్‌లు స్పందించారు.

Group 2 Mains postponed in Andhra Pradesh

విద్యార్థులు పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. మెయిన్స్‌ను వాయిదా వేసింది. మే 21, 22 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్‌ను జూలై 15, 16వ తేదీలకు వాయిదా వేసింది. అలాగే, జూలై రెండో వారంలో జరగాల్సిన పంచాయతీ కార్యదర్శి మెయిన్స్‌ను జూలై 30వ తేదీకి వాయిదా వేసింది. ఇది విద్యార్థులకు ఊరట కలిగించే విషయం.

కాగా, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవాలని, పరీక్షలను వాయిదా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి రావడం గమనార్హం. పవన్ స్పందించే సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తుందనే వాదన ఉంది. ఇప్పుడు మరోసారి ఆయన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+