రేపు జివోఎం భేటీ: అందిన నివేదికలు, త్వరలో టి బిల్లు!
న్యూఢిల్లీ: విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జివోఎం) గురువారం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో భేటీ కానుంది. ఇప్పటికే వివిధ శాఖల నుండి హోంమంత్రిత్వ శాఖకు నివేదికలు అందాయి. వీటి పైన జివోఎంలో చర్చించనున్నారు.
తొమ్మిది ప్రధాన శాఖల నుండి హోంమంత్రిత్వ నివేదికలను కోరింది. ఆయా శాఖలు నివేదికలు అందించారు. ఈ నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకొని బిల్లులో చేర్చాల్సిన అంశాల పైన చర్చించనున్నారు.

విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో అలజడి రాజుకున్న విషయం తెలిసిందే. దీంతో సీమాంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీ, హైదరాబాద్‌ను ఏం చేయాలనే విషయం, ఆర్టికల్ 371(డి), విద్యుత్, జల తదితర అంశాల పైన చర్చించనున్నారు.
అనంతరం బిల్లును రూపొందించే అవకాశముంది. ఈ నేల 14న లేదా 21న జరిగే కేబినెట్‌లో బిల్లును పెట్టే యోచనలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, విభజనపై కేంద్ర మంత్రుల బృందం ఇప్పటికే రెండుసార్లు భేటీ అయింది. పలు అంశాల పైన బృంద సభ్యులు చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications