వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలికి వంగవీటి రాధా హ్యాండ్ ? తెరపైకి రాధా-రావి యూత్ ! గుడివాడ టెన్షన్ వెనుక ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రముఖ కాపునేత, దివంగత వంగవీటి రంగా తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగవీటి రాధాకృష్ణ.. అనంతరం కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అయినా తన పాత స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి వారిని వదులుకోలేదు. సందర్భానుసారంగా వారితో కలిసి ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకావడం, రహస్య భేటీలు నిర్వహించడం చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా గుడివాడలో వరుస పర్యటనలు చేస్తున్న రాధా ఇప్పుడు అక్కడి రాజకీయాల్ని కీలక మలుపు తిప్పేందుకు సిద్దమవుతున్నారు.

గుడివాడ పాలిటిక్స్

గుడివాడ పాలిటిక్స్

గుడివాడలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు ఎన్నారై వెనిగండ్ల రామును ప్రోత్సహిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే కొడాలికి వ్యతిరేకంగా జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే ఈ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వంగవీటి రాధా ఈ మధ్య గుడివాడలోనే కనిపిస్తున్నారు. స్ధానిక కాపు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. మధ్యలో తన పాత స్నేహితుల్ని సైతం కలుస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయం క్లైమాక్స్ కు వచ్చేసింది.

 వంగవీటి రాధా రాజకీయం

వంగవీటి రాధా రాజకీయం

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వంగవీటి రాధా అక్కడ కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. తన సొంత సామాజికవర్గం కాపుల్ని ఏకం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. అక్కడా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరికి వారు బహిరంగంగానే రాధా సొంత పార్టీ టీడీపీని తిడుతున్నా పట్టించుకోవడం లేదు.దీనిపై టీడీపీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా కాపు సామాజికవర్గంలో ఎదుగుతున్న రాధాను ఇప్పటికిప్పుడు దూరం చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇలాంటి నేపథ్యంలో గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్న రావి వెంకటేశ్వరరావుతో వంగవీటి రాధా తాజా స్నేహం ఆసక్తి రేపుతోంది.

తెరపైకి రాధా-రావి యూత్

తెరపైకి రాధా-రావి యూత్


గుడివాడలో వరుస పర్యటనలు చేస్తూ కాపు సామాజిక వర్గ నేతలతో భేటీలు నిర్వహించిన వంగవీటి రాధా చివరికి అక్కడి టీడీపీ ఇన్ ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రావితో భేటీ అయిన రాధా.. రాధా-రావి యూత్ ఏర్పాటుకు కారణమయ్యారు. ఇప్పుడు ఈ రాధా-రావి యూత్ రాధా తండ్రి వంగవీటి రంగా వర్ధంతిని ఇవాళ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. దీంతో కొడాలి వర్గం వీరిపై మండిపడుతోంది. బహిరంగంగా రాధాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కొడాలి తన అనుచరుడైన కాశీ సాయంతో రావికి హెచ్చరికలు పంపారు. దీంతో గుడివాడ భగ్గుమంది.

 రంగా వర్ధంతిలోనూ రాధా-రావి ?

రంగా వర్ధంతిలోనూ రాధా-రావి ?

గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా రంగంలో ఉంటారని భావిస్తున్న రావి వెంకటేశ్వరరావు ఇవాళ వంగవీటి రంగా వర్ధంతి నిర్వహణకు సిద్దమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వంగవీటి రాధాకు ఆహ్వానం పంపారు. రాధా-రావి యూత్ తరఫున నిర్వహించే ఈ కార్యక్రమానికి రాధా హాజరైతే కచ్చితంగా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడబోతోంది. దీంతో ఇవాళ గుడివాడలో జరిగే రంగా వర్ధంతి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నానికి కీలకంగా మారాయి. ఇవాళ రంగా వర్ధంతి కార్యక్రమం విజయవంతమైతే కొడాలి ప్రాభవానికి గండి పడటం ఖాయం. దీంతో గుడివాడలో ఒక్కరోజు ముందు ఉద్రిక్తతలు తలెత్తాయి.

గుడివాడలో టెన్షన్ల వెనుక ?

గుడివాడలో టెన్షన్ల వెనుక ?

గుడివాడలో ఇవాళ రంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు రావి వర్గం ప్రయత్నిస్తుండటం, దానికి రాధా హాజరయ్యే అవకాశాలుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. అదే సమయంలో రావి వర్గం రంగా వర్ధంతి ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ కొడాలి వర్గం హెచ్చరికలు పంపుతోంది. ఇదే క్రమంలో కొడాలి అనుచరుడు కాశీ.. రావికి ఫోన్ చేసి చంపేస్తానంటూ హెచ్చరించడం కలకలం రేపింది. రావి కార్యాలయంపై దాడులకు వైసీపీ శ్రేణులు తరలిరావడం, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇవాళ రంగా వర్ధంతి కూడా రాధా-రావి వర్గం నిర్వహించి,దానికి రాధా కూడా హాజరైతే గుడివాడలో మరిన్ని ఉద్రిక్తతలు తప్పేలా లేవు. అదే సమయంలో కొడాలికి రాబోయే రోజుల్లో గుడివాడలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే రాధా సాయంతో కొడాలిని ఓడిస్తామంటూ రావి వర్గం బహిరంగంగానే హెచ్చరికలు చేస్తోంది.

English summary
tdp leader vangaveeti radha krishna seems to break up his friendship with former ysrcp minister kodali nani and joins party leader raavi venkateswara rao to organise his late father ranga's death anniversary today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X