ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లికి వెళుతూ ఆరుగురు మృతి
శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. కర్నూలు-గుంటూరు రహదారిలో మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెం-మేడికొండూరు గ్రామాల మధ్య ఈ ప్రమాదం
గుంటూరు: శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. కర్నూలు-గుంటూరు రహదారిలో మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెం-మేడికొండూరు గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న బొలెరో వాహనంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మేడికొండూరు సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ, బొలెరో వాహనం ఢీకొన్నాయి. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన మరొకరిని గుంటూరుకు తరలిస్తుండగా మృతి చెందాడు. గుంటూరు డీఎస్పీ శ్రీనివాసరావు, మేడికొండూరు సీఐ బాలాజీ, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఓ వివాహ వేడుకకు వెళ్లుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.
మృతులను పి. వెంకటరమణ(47), ఎం. శ్రీనివాసరావు(32), ఎస్ రాఘవేంద్ర రావు(57), దాసరి కిరణ్(43), మాదాసు రాజారావు(45), వెంకట సుబ్బారెడ్డి(45)లుగా గుర్తించారు. వీరి మరణ వార్త తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications