అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు వరుస షాక్‌లు, నేతల ఆందోళన: గుర్నాథ్ రెడ్డి ఝలకిస్తారా?

నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల్లో ఆందోళన, అసంతృప్తి బయటపడుతోందని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల్లో ఆందోళన, అసంతృప్తి బయటపడుతోందని తెలుస్తోంది.

జగన్‌కు షాక్: దెబ్బతో టిడిపిలోకి గుర్నాథ్? పరిటాల-జెసిలతో సంబంధాలుజగన్‌కు షాక్: దెబ్బతో టిడిపిలోకి గుర్నాథ్? పరిటాల-జెసిలతో సంబంధాలు

వైసిపి అధినేత జగన్ వైఖరితో ఇప్పటికే పలువురు అసంతృప్తితో ఉన్నారని, వారు సమయంకోసం వేచి చూశారని అంటున్నారు. అలాంటి వారు ఇప్పుడు టిడిపిలోకి చేరుతారని చెబుతున్నారు.

మరికొందరు భవిష్యత్తుపై ఆందోళనతో టిడిపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కూడా టిడిపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

టిడిపిలో చేరికపై చర్చ

టిడిపిలో చేరికపై చర్చ

అనంతపురం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన అనుచరులతో మరోసారి భేటీ అయ్యారని అంటున్నారు. కొన్నాళ్లుగా ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. టిడిపిలో చేరికపై అనుచరులతో చర్చిస్తున్నారని సమాచారం.

టిడిపి నేతలతో మంచి సంబంధాలు నెరపుతున్నారు

టిడిపి నేతలతో మంచి సంబంధాలు నెరపుతున్నారు

గుర్నాథ్ రెడ్డి ప్రస్తుతం వైసిపిలోనే ఉన్నప్పటికీ టిడిపి నేతలతో మంచి సంబంధాలు నెరుపుతున్నారని చెబుతున్నారు. పరిటాల కుటుంబం, జెసి కుటుంబంతోను సత్సంబంధాలు నెరపుతున్నారని చెబుతున్నారు.

రెండువైపులా ఒత్తిడి

రెండువైపులా ఒత్తిడి

గుర్నాథ్ రెడ్డి కుటుంబీకులు గతంలో బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట నగరం నడిబొడ్డున ఉన్న మిస్సమ్మ బంగళా స్థలాన్ని అక్రమ పద్ధతిలో ఆక్రమించుకున్నట్టు ఆరోపణలున్నాయి. అప్పట్లో దీనిపై విపక్షాలు పోరాటం చేశాయి. అందులో టిడిపి కూడా ఉంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక మిస్సమ్మ బంగ్లాబై సిఐడి విచారణకు ఆదేశించింది.

రెండువైపులా ఒత్తిడి

రెండువైపులా ఒత్తిడి

మరోవైపు, రాష్ట్రంలో వైసిపికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. 2019పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు రాజకీయ భవితవ్యం, మరోవైపు బంగ్లాపై అధికార పార్టీ నుంచి ఒత్తిడి నేపథ్యంలో.. టిడిపిలో చేరాలని గుర్నాథ్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.

వైయస్ మృతి తర్వాత జగన్ వద్దకు

వైయస్ మృతి తర్వాత జగన్ వద్దకు

గుర్నాథ్ రెడ్డి 2009 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీచేసి గెలిచారు. వైయస్ మృతి అనంతరం వైసిపిలో చేరారు. నాడు కాంగ్రెస్‌ నుంచి వైసిపిలో చేరిన ఎమ్మెల్యేలు 2011లో రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో అనంత నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన మహలక్ష్మి శ్రీనివాస్‌పై గుర్నాథరెడ్డి పోటీచేసి గెలుపొందారు.

అప్రమత్తమైన వైసిపి

అప్రమత్తమైన వైసిపి

2014 సాధారణ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఆయన ఓడిపోయారు. జిల్లాలో తనదైన ముద్రవేసిన గుర్నాథ్ రెడ్డి చూపు ప్రస్తుతం టిడిపి వైపు ఉండటంతో వైసిపి నేతలు కొందరు అప్రమత్తమయ్యారు. ఆయనతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

English summary
YSR COngress Party leader and former MLA Gurunath Reddy discussions with followers for joining Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X