"హోదా" పై అందుకే అలా చేశా - అన్నీ తెలిసి కూడా జగన్ ఇలా : హోం శాఖకు జీవీఎల్ లేఖ..!!

ఏపీలో ఇప్పుడు హోదా వ్యవహారం మరోసారి రాజకీయంగా దుమారానికి కారణం గా మారుతోంది. కేంద్రం హోం శాఖ ఈ నెల 17న పునర్విభజన సమస్యల పైన చర్చల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానం పంపింది. అందులో మొత్తం 9 అంశాల పైన చర్చ ఉంటుందని తొలుత సర్క్యులర్ లో స్పష్టం చేసింది. ఆ తరువాత కొద్ది గంటలకే అందులోని హోదా అంశాన్ని తొలిగించింది. దీంతో పాటుగా రెవిన్యూ లోటు భర్తీ అంశాన్ని తీసేసింది. దీని పైన వైసీపీ నేతలు బీజేపీ ఎంపీ జీవీఎల్ ..చంద్రబాబును టార్గెట్ చేసారు. దీని పైన బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసారు. అందులో కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ సమావేశ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా వంటి అంశాల తొలగింపు పై స్టేట్ మెంట్ విడుదల చేయాలని కోరారు.

హోం శాఖ కార్యదర్శికి లేఖ

హోం శాఖ కార్యదర్శికి లేఖ

ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయటానికి మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక హోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది తామే అని చెప్పుకొచ్చారు. అప్పుడు టీడీపీ, వైసీపీ నేతలు నిద్ర పోతూ ఉన్నారని జీవీఎల్ విమర్శించారు. తమ ఒత్తిడి వల్లే ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశం వచ్చిందని చెబుతూనే... సంబంధం లేని నాలుగు అంశాలు పొరపాటుగా ఎజెండాలో చేర్చారని వివరించారు. తాను అడిగిన తర్వాతే కమిటీ ఎజెండా అంశాలను సమీక్షించి మార్పులు చేసిందని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందని చొరవ తీసుకున్నానన్నారు. తన ప్రయత్నంతో హోదా అంశం మరింత సంక్లిష్టం కాకుండా చేయగలిగానని వివరించారు. అసలు ప్రత్యేక హోదా ఇప్పుడు లేదని పునరుద్ఘాటించారు. దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలన్నారు.

జీవీఎల్ తేల్చి చెప్పేసారు

జీవీఎల్ తేల్చి చెప్పేసారు

ఏపీ రెవెన్యూ గ్యాప్, స్పెషల్ స్టేటస్ వంటి అంశాలు వివాద పరిష్కార కమిటీలో ఉంచే అంశం పై బుగ్గన స్పందించాలని డిమాండ్ చేసారు. బుగ్గన ఉండాలని చెబితే నా లేఖను మార్చుకుంటానని చెప్పారు. జూనియర్ స్థాయి అధికారులు పొరపాటు చేశారన్నారు. దాన్ని రాజకీయం చేస్తే ఎలా అని జీవీఎల్ ప్రశ్నించారు. వైసిపి 22మంది ఎంపీలు చేయాల్సిన పనిని తానే చేస్తున్నానని చెప్పారు. కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకుని, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎపికి ఇంత చేస్తుంటే...‌ కనీసం కేంద్రానికి ధన్యవాదాలు కుడా చెప్పలేకపోయారని వ్యాఖ్యానించారు. ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ను చదవడమే వైసిపి నాయకులకు అలవాటంటూ విమర్శించారు. ఈనెల 17న గడ్కరీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారని తెలిపారు.

వైసీపీ ఎంపీలు అసమర్ధులు

వైసీపీ ఎంపీలు అసమర్ధులు

వైసిపి ఎంపీలు అసమర్ధులు.. అందులే సందేహం లేదంటూ వ్యాఖ్యానించారు. మీ నియోజకవర్గ సమసపై కూడా మాట్లాడటం చేతకాదా అని నిలదీసారు. కనీసం కేంద్ర మంత్రులు అపాయిట్మెంట్ కూడా తెచ్చు కోలేరని ఎద్దేవా చేసారు. వైసిపి ప్రభుత్వం వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే కొత్త సమస్యలు తెర పైకి తెస్తున్నారని ఆరోపించారు. జీతాలు, పెన్షన్ లు ఇవ్వలేని స్థితి లో ఎపి ప్రభుత్వం ఉందని నేను మాట్లాడానని..పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి చొరచ చూపాలని నేను కేంద్రాన్ని కోరానని వెల్లడించారు. లక్ష కోట్లలో ఎపి కి ఐదు వేల కోట్లు రానున్నాయని చెప్పారు. రాష్ట్రానికి మేలు చేయాలని మేము పని చేస్తుంటే... మా పై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు.

జగన్ కు అన్నీ తెలుసంటూ

జగన్ కు అన్నీ తెలుసంటూ

ఎపికి అంతకు మించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నాటి సిఎం చంద్రబాబు అంగీకరించి నిధులు తెచ్చుకున్నారన్నారు. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అన్నీ తెలిసి కూడా జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదని.. కానీ నిధులు తెచ్చుకునేందుకు కృషి చేయాలని సూచించారు. హోదా అజెండా తో వచ్చారు కాబట్టే జగన్ ... గుర్తు వచ్చినప్పుడల్లా మాట్లాడతారంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+