'అల్లుడికి వేరే మహిళతో లింక్, అతనే చంపేశాడు':అమెరికా హత్యలపై .

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు:తమ కూతురు, మనుమడిని అల్లుడే కొట్టిచంపాడని అమెరికాలో చనిపోయిన శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురయ్యారు.

హనుమంతరావుకు, శశికళకు 14 ఏళ్ళ క్రితం వివాహమైంది.అయితే ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు శుక్రవారం నాడు స్పందించారు.

hanumantha rao illegal affair with american lady :sasikala parents

హనుమంతరావుకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.అయితే ఈ విషయమై శశికళ తమతో పలుమార్లు ఫోన్ చేసి ఏడ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

హనుమంతరావు అమెరికాలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే తమ కూతురును వేధింపులకు గురిచేశాడని, ఆమె మరణానికి కూడ హనుమంతరావే కారణమని వారు ఆరోపిస్తున్నారు.తన కూతురును , మనుమడిని హనుమంతరావే హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు..

హనుమంతరావు వివాహేతర సంబంధం కారణంగానే తన కూతురును తరచూ వేధింపులకు గురిచేసేవాడని వారు చెప్పారు. ఈ వేధింపులకు తట్టుకోలేక తమ కూతురు తమతో మాట్లాడిన సందర్భంలో ఈ విషయాలను ప్రస్తావించేందని చెప్పారు.తమ కూతురుకు ఎలాంటి ఇబ్బందులు లేవని హనుమంతరావు కుట్ర పూరితంగా వ్యవహరించి ఆమెను హత్య చేశాడని వారు ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
hanumantha rao illegal affair with american lady alleged sasikala parents on friday. sasikala and her son murdered in america.hanumantha rao murdered his daughter .
Please Wait while comments are loading...