సమైక్యాంధ్ర అన్నందుకేనా: బాబుపై హరి, టిడిపి వివరణ

కాగా, రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ హరికృష్ణ రాజ్యసభ సభ్వత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విభజన ప్రకటన వెలువడిన కొద్ది రోజుల తర్వాత నుంచి సమైక్యవాదాన్ని హరికృష్ణ బలంగా విన్పిస్తున్నారు. పార్టీ పైన పలుమార్లు తన అసంతృప్తిని ప్రకటించారు. ఇప్పుడు తనకు పిలుపురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపి వివరణ
ప్రజాగర్జన కోసం తాము ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కేవలం జిల్లా నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపించామన్నారు. మిగతా నాయకులు ఎవరైనా స్వచ్చంధంగా పాల్గొనవచ్చునని చెప్పారు.
అచ్చెన్నాయుడికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన టిడిపి వనభోజన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కూలి టిడిపి నేత అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి అఫ్పల సూర్యనారాయణకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications