పుష్కరాల్లో తొక్కిసలాట: హర్షకుమార్ దీక్ష వివాదం, కొడుకు వ్యాఖ్య!
రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు మూడు రోజుల ముందు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక స్థలం కోసం నిరాహార దీక్ష చేశారు. ఇది వివాదాలకు దారి తీస్తుందని పోలీసులు పుష్కరాలకు ముందు రోజు ఆయన దీక్షను భగ్నం చేశారు.
ఆ సమయంలో హర్ష కుమార్ తనయుడు శ్రీరాజ్, కొంతమంది అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబూ ఖబడ్దార్, పుష్కరాలు ఎలా జరుపుతారో చూస్తామని శ్రీరాజ్ హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల పైన కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ వ్యాఖ్యలు చేయడం నిజమే అయినప్పటికీ, పుష్కరాలను అడ్డుకోవడం తమ ఉద్దేశ్యం కాదని శ్రీరాజ్ గురువారం విలేకరులతో చెప్పారు. తొక్కిసలాట మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్రపతికి నివేదిక పంపిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి గోకవరం బస్టాండులో జరిగిన అగ్ని ప్రమాదం పైన అనుమానాలు ఉన్నాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడానని, వారు చెప్పిన ప్రకారం అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాలేదని, గ్యాస్ సిలిండర్లు లేవని, ఇది ప్రమాదం కాదని, దీనికి కారణాలు ఏమిటో దర్యాఫ్తులో తెలుస్తుందన్నారు. ప్రమాద కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు డిజిపి తెలిపారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications