ఏపీ మొత్తం గజగజ

Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది.

నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Heavy rainfall forecast to these districts in Andhra Pradesh today

అటు తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్‌, దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, దక్షిణ కోస్తా తీరంలోని నెల్లూరు, రాయలసీమ జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. అత్యధికంగా కేఎం అగ్రహారంలో 187 మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైంది. ఆర్‌కే పురం- 162, రాచపాలెం-152, మన్నార్ పొలూరు- 149, భీములవారిపాలెం- 137 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది.

అటు తమిళనాడు మొత్తం జలమయమైంది. నీలగిరి, ఈరోడ్ కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండిగల్, కృష్ణగిరి, సేలం, నామక్కల్, తిరుచ్చి, కరూర్, మధురై, తేని, తూత్తుకూడి వంటి జిల్లాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కర్ణాటక తీర ప్రాంత జిల్లాలు దక్షిణకన్నడ, ఉడుపి, చామరాజనగర జిల్లాలకు ఎల్లో అలర్ట్, బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+