హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

weather: ఏపీలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు, ప్రజలకు అలర్ట్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరోసారి వరుణ దేవుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. భారత వాతావరణ శాఖ (IMD) అమరావతి.. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

ఏపీ కోస్తా ప్రాంతం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహ్‌తక్, గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్‌పూర్, బాలాసోర్ మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం సముద్ర మట్టం వరకు వెళ్లి సగటున 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి శాస్త్రవేత్త సగిలి కరుణసాగర్ తెలిపారు.

 Heavy rains in Andhra Pradesh for next four days: IMD predicts

జార్ఖండ్, పొరుగు ప్రాంతాలపై తుఫాను ప్రసరణ ఇప్పుడు ఉత్తర ఒడిశా, పొరుగు ప్రాంతాలపై ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి, ఎత్తుతో నైరుతి వైపుకు వంగి ఉంటుంది. భారీ వర్షాల కురుస్తున్న క్రమంలో ప్రజలు అనవసరంగా బయటికి వెళ్లరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గత 24 గంటల్లో అమరావతిలో అత్యధికంగా 63మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నందిగామలో 41మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. బాపట్లలో 7 డిగ్రీల సెల్సియస్‌ తగ్గుదల, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీలుగా నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

English summary
Heavy rains in Andhra Pradesh for next four days: IMD predicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X