సినిమాలు - పెళ్లిపై హీరో ప్రభాస్ కీలక ప్రకటన, తిరుపతిలోనే..!!

హీరో ప్రభాస్ ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుపతి వేదికగా కీలక ప్రకటన చేసారు. ప్రభాస్..కృతి సనన్ నటించిన ఆదిపురుష్ ఈ నెల 16న విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రభాస్ పాత్ర పైన చినజీయర్ అభినందించారు. ప్రభాస్ ప్రసంగం సమయంలో ఎంతో కాలంగా చర్చలో ఉన్న తన వివాహం గురించి కీలక ప్రకటన చేసారు.

తిరుపతిలోనే వివాహం:ఈ వేడకలో మాట్లాడిన ప్రభాస్ ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో మీ ముందుకు వస్తానంటూ అభిమానులకు మాట ఇచ్చారు. కుదిరితే మూడు సినిమాలు వచ్చేలా చూస్తానని చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించారు. దీని పైన ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.

Hero Prabhas made big announcement on his marriage and Cinemeas in Adipurush pre release Event in Tirupati

తన వివాహం తిరుపతిలోనే జరుగుతుందంటూ ప్రకటించారు. ఇక్కడే..తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటా అంటూ ప్రభాస్ చెప్పటంతో వెంటనే అభిమానులు హర్షధ్వానాలతో ఆ ప్రకటనను స్వాగతించారు. ఇదే సమయంలో ఆదిపురుష్ కోసం ఏ విధంగా కష్టపడిందీ వివరించారు. అభిమానులు ఇచ్చిన ధైర్యంతోనే టీం మరింత కష్టపడి పని చేసందని ప్రభాస్ వివరించారు.

ఏడాదికి రెండు సినిమాలు:ఏడు నెలల క్రితం 3డీలో ట్రైలర్ విడుదల చేసిన సమయంలో మీరిచ్చిన ధైర్యంతోనే టీం మరింతగా కష్టపడిందని చెప్పుకొచ్చారు. ఒక యుద్దంలాగా సినిమా యూనిట్ మొత్తం కష్టపడిందని వివరించారు. రోజుకు రెండు మూడు గంటలే నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. అదిపురుష్ లాంటి సినిమా చేయటం తనకు దక్కిన అదృష్టంగా పేర్కొన్నారు.

ఒక సందర్భంలో మెగాస్టార్ ను చిరంజీవిని కలిసిన సమయంలో ఆయన ఏంటి రామాయరణం చేస్తున్నావా అని అడిగారని వెల్లడించారు. తాను అవునని చెప్పగానే అందరికీ ఇలాంటి అదృష్టం దొరకదని...నీకు దక్కిందంటూ తనను అభినందించారని వివరించారు. రామాయణం చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని..అలాంటి కష్టాలు తమకు ఎదురయ్యాయని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి:తన 20 ఏళ్ల కెరీర్ లో ఓం రౌత్ లాంటి వ్యక్తిని చూడలేదని ప్రభాస్ పేర్కొన్నారు. ఒక పోరాటంగా ఈ సినిమాను రౌత్ పూర్తి చేసారని ప్రశంసించారు. సినిమా ఫంక్షన్లకు హాజరు కాని చిన జీయర్ స్వామి వచ్చి తమను ఆశీర్వదించారన్నారు. నిర్మాత భూషణ్ కుమార్ తన తండ్రి కోరిక మేరకు రామాయణం తీసారని వివరించారు.

ఈ సినిమాను ఒక ఎమోషన్ గా తీసుకున్నారని చెప్పారు. ఇందులో తనతో పాటుగా లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే చాలా బాగా నటంచారని అభినందించారు. సీత పాత్రకు సంబంధించిన పోస్టర్ లో కృతి సనన్ ఎక్స్ ప్రెషన్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. టెక్నికల్ టీం అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చిందన్నారు. ఎప్పటికీ ప్రేక్షకులు..అభిమానులే తన బలమని ప్రభాస్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+