వాహనంలో ఉన్న వారిపై కేసు ఎలా పెడతారు - జగన్ కేసులో హైకోర్టు..!!

సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ పర్యటన సమయంలో సింగయ్య ఆయన కారు కింద పడి మరణించినట్లు కేసు నమోదు చేసారు. ఈ కేసులో జగన్ ను ఏ-2గా పేర్కొన్నారు. కారు డ్రైవర్ తో పాటుగా జగన్, పార్టీ ముఖ్య నేతలను కేసులో చేర్చారు. కాగా.. జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. ఆ సమయంలో కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్న వారి పైన కేసు ఎలా పెడతారని ప్రశ్నించింది. రాజకీయ ప్రతీకారంతోనే జగన్ పైన కేసు నమోదు చేసారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.

సింగయ్య మృతి కేసులో జగన్ ను ఏ-2గా చేర్చటంతో.. ఆయనతో పాటుగా పార్టీ నేతలు హైకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాదు లు ఇది రాజకీయ ప్రతీకారంతో నమోదు చేసిన కేసుగా కోర్టు కు వివరించారు. ప్రమాదం జరిగిన తరువాత ఒక కారు కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి.. ఆ తరువాత జగన్ కారుగా చెప్పారని కోర్టుకు వివరించారు. జగన్ పర్యటనలకు భద్రత కల్పించటం లేదని.. ఈ అంశాల పైన మరో రెండు పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీని పైన ప్రభుత్వ తరపు న్యాయ వాదులు తమ వాదనలు వినిపించారు. పోలీసులు జగన్ పర్యటన వేళ అక్కడ నెలకున్న పరిస్థితు ల కారణంగా ముందస్తు ఆంక్షలు విధించారని పేర్కొన్నారు.

high-court-made-key-comments-over-jagan-petition-trail-in-singaiah-accident

జగన్ రెంటపాళ్ల పర్యటనకు మూడు కార్లు.. వంద మందికి మాత్రమే అనుమతి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి పర్యటన చేసారని కోర్టుకు వివరించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు.. అంబులెన్సుకు సమాచారం ఇవ్వలేదని వాదించారు. కాగా, వాదనల సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారు లో ఉన్న వారి పైన కేసులు ఎలా పెడతారని ప్రశ్నించింది. ప్రమాదానికి ప్రయాణీకులను ఎలా బాధ్యలను చేస్తారని వ్యాఖ్యానించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిస లాట జరిగింది కదా.. అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరగా.. జూలై 1వ తేదీకి కేసు వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటిదాకా నిందితుల పైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసుల ను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+