హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ ఫిరాయింపులు: టీడీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పార్టీ ఫిరాయింపుపై ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు, ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వీరితో పాటు తొలిసారి శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్ధానం వాయిదా వేసింది. నోటీసులు అందుకున్న వారిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డి ఉన్నారు.

High court send notices to mlas and mlcs

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఆమోస్, భాను ప్రసాద్, జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డిలు ఉన్నారు.

'పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఆలోచించాలి'

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బడ్జెట్‌లో కనబడకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ బీజేఎల్పీ నేత డా. లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం హైదరాబాద్‌లో కే. లక్ష్మణ్ సమావేశమయ్యారు.

తెలంగాణ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. మాటల గారడీతోనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఆలోచించాలని డాక్టర్ కే. లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీకి సూచించారు.

English summary
Andhra Pradesh High court send notices to Telugudesam party mlas and Congress mlcs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X