వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై ఏం చేయాలని: పనులు మీరు చేస్తారా.. ఆదేశాలు ఇవ్వాలా: హైకోర్టు సీరియస్..!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి అంశంలో ఒక వైపు రాజకీయంగా దుమారం కొనసాగుతుండగానే..మరో వైపు హై కోర్టు సైతం స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది .ఏపీ ప్రభుత్వాన్ని ప్రవ్నించింది. రెండు వారాల సమయం ఇచ్చింది. పనులు మీరు చేస్తారా..ఆదేశాలు ఇవ్వాలా అని హెచ్చరించింది. అసలు ప్రభుత్వం విధానం ఏంటని నిలదీసింది. హైకోర్టు ఈ స్థాయిలో స్పందించటంతో ఇప్పుడు ప్రభుత్వంలో దీని పైన చర్చ మొదలైంది. రెండు వారాల్లోగా ప్రభుత్వ వైఖరేంటో చెప్పకపోతే మధ్యంతర ఉత్తర్వులిస్తామని, కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోర్టు స్పష్టంచేస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది.

రాజధానిగా అమరావతి వేస్ట్.. మంగళగిరి బెస్ట్ .. నిపుణుల కమిటీకి చెప్తా అంటున్న ఎమ్మెల్యే ఆర్కే రాజధానిగా అమరావతి వేస్ట్.. మంగళగిరి బెస్ట్ .. నిపుణుల కమిటీకి చెప్తా అంటున్న ఎమ్మెల్యే ఆర్కే

హైకోర్టు తీవ్ర స్పందన..

హైకోర్టు తీవ్ర స్పందన..

రాజధాని నిర్మాణం, స్విస్‌ చాలెంజ్‌ విధానంపై రెండు వారాల్లోగా తేల్చి చెప్పాలని హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం అజెండాలతో తమకు సంబంధం లేదని... చట్టంతో మాత్రమే సంబంధమని పేర్కొంది. హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన విచారణ సమయంలో కోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టులో న్యాయవాదులు..న్యాయమూర్తులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రస్తావించింది.
జడ్జీలు గెస్ట్‌హౌ్‌సలలో తల దాచుకుంటున్నారు. వారికి ఇప్పటిదాకా క్వార్టర్లు నిర్మించలేదు. న్యాయవాదులకు కనీస సదుపాయాల్లేవు. లాయర్లు కప్పు టీ దొరక్క అల్లాడిపోతున్నారు. తగిన ఏర్పాట్లు చేసి తీరాల్సిందే. లేకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైకోర్టులో జరిగిన విచారణ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 పనులు చేస్తారా..ఆదేశాలివ్వాలా..

పనులు చేస్తారా..ఆదేశాలివ్వాలా..

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ ఎనేబులింగ్‌ (ఏపీఐడీఈ) 2001 చట్టానికి 2017లో ఏపీ న్యాయశాఖ చేసిన సవరణను సవాల్‌ చేస్తూ ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ ప్రతినిధి వై.సూర్యనారాయణమూర్తి, స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని సవాల్‌ చేస్తూ మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఏపీఐడీఈ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రాజధాని పనుల ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యంపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పనుల పూర్తి కోసం ఇంకెంత కాలం వేచి ఉండాలని నిలదీసింది. పనులు మీరు చేస్తారా.. లేక మమ్మల్ని ఆదేశించమంటారా.. అని సూటిగా ప్రశ్నించింది.

 ప్రతి రోజు ఫిర్యాదులొస్తున్నాయి..

ప్రతి రోజు ఫిర్యాదులొస్తున్నాయి..

రాజధానిలో నిలిచిపోవడంతో హైకోర్టులో సమస్యలు నెలకొన్నాయి. కార్లు పెట్టుకోవడానికి చోటు లేదు. కనీసం కూర్చోవడానికి కూడా తగిన జాగా లేదు. వీటన్నింటిపైనా ప్రతిరోజూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. మీరేం చేయదలచుకున్నారో, మీ వైఖరేంటో రెండు వారాల్లో స్పష్టం చేయండని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఉమ్మడి హైకోర్టును హడావుడిగా విభజించారని... దీనిపై కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. 2వారాల్లోగా ప్రభుత్వ వైఖరేంటో చెప్పకపోతే మధ్యంతర ఉత్తర్వులిస్తామని, కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోర్టు స్పష్టంచేస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు కోర్టు స్పందన అంశం ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలో చర్చ మొదలైంది. దీని పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తునేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
High court serious on AP Govt on Capital controversy. Court asked govt view on capital and complete of works. High court says that..If govt not taken steps with in two weeks then court will give orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X