అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు: హైకోర్టు, ఏపి, టీల నుంచి ఒక్కొక్కరు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు చేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. అగ్రిగోల్డ్ మోసాలపై సోమవారం జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో తమకు సూచనలు, సలహాలు కూడా కమిటీ ఇస్తుందని తెలిపింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీలో సభ్యుడి స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు సమర్పించింది. తెలంగాణ నుంచి సభ్యుడి కోసం ఐదు పేర్లతో కూడిన జాబితా సమర్పించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆస్తుల విక్రయాల అనుమతులు, ఇతర వ్యవహారాలన్నీ అగ్రిగోల్డ్ యాజమాన్యమే చూసుకోవాలని స్పష్టం చేసింది. వ్యవహారాల పర్యవేక్షణ అధికారం కోర్టుకు ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications