కాపు రిజర్వేషన్ల పై హైకోర్టులో కీలక పరిణామం- సముచితమేనా..!!

కాపు రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈడబ్ల్యూఎస్
రిజర్వేషన్ల కల్పన చట్టానికి లోబడి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు సందేహాన్ని వ్యక్తం చేసింది. 103 రాజ్యాంగ సవరణ, కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషన్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కాపులకు 5శాతం రిజర్వే షన్‌ కల్పించేలా తీసుకొచ్చిన చట్టాలు అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు కాపులకు 5శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఈడబ్ల్యుఎస్‌లో విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కల్పన చట్టానికి లోబడి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇడబ్ల్యుఎస్‌ కోటా 10 శాతం రిజర్వేషన్లలో ఒక్క కాపులకే 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది.

High Court sought detailed Report from AP government regarding the legal status of Kapu reservations

ఇది సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కాపు కోటాను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై న్యాయవాదులు ఉగ్రనరసింహ, కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపించారు. ఒకే సామాజికవర్గానికి 5శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. ఒకే సామాజికవర్గానికి సగం(5శాతం) రిజర్వేషన్‌ కల్పించడం సబబు కాదని పేర్కొంది. 103 రాజ్యాంగ సవరణ, కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషన్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ కోసం జనవరి 29కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+