నా పాస్ పంపిస్తా, ఆమెను నా కారులో ఎక్కించుకుంటా: పోలీసులపై జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైపీసీ ఎమ్మెల్యే రోజాపై హైకోర్టు ఉత్తర్వులతో అసెంబ్లీకి రావడంతో ఉత్కంఠకు తెర లేచింది. జగన్ కాన్వాయ్‌లో అసెంబ్లీలోకి చేరుకున్న రోజా, ఆమె తరుపు న్యాయవాది ఇందిరా జైసింగ్ అసిస్టెంట్‌ని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో జగన్ కల్పించుకున్నారు.
ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకువెళతానని అన్నారు. మీరెలా తీసుకెళ్తారని పోలీసులు ప్రశ్నించగా, జగన్ కొంత ఆగ్రహానికి గురయ్యారు. "కావాలంటే నా పాస్ తీసుకోండి. ఆమెను నేను తీసుకెళ్తా. ఐ హ్యావ్ మై రైట్. ఐ కెన్ టేక్ ఎనీబడీ" అంటూ వాగ్వాదానికి దిగారు. నా ఆఫీసుకు తీసుకెళ్తా. కావాలంటే తన తరఫున పాస్ పంపిస్తానని పోలీసులకు చెప్పారు.
Also Read: రోజా వివాదం గురించి మరిన్ని విశేషాలు
దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు ఇందిరా జైసింగ్ అసిస్టెంట్‌ను అసెంబ్లీలోనికి వెళ్లేందుకు అనుమతించారు. మరోవైపు రోజాను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించొద్దంటూ స్పీకర్ కార్యాలయం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని చీఫ్ మార్షల్ చెబుతున్నారు.

రోజాను కేవలం అసెంబ్లీ ప్రాంగణంలోకి మాత్రమే అనుమతిస్తాము గానీ, సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయిని తెలిపారు. ఈ మేరకు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్, మహిళా మార్షల్స్‌ను మోహరించారు.
మార్షల్స్ అడ్డుకోవడంతో వైసీపీ అధినేత జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ కాస్తంత గందరగోళం నెలకొంది. ఏకపక్ష నిర్ణయం నశించాలంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో చీఫ్ మార్షల్ గణేష్‌తో వైసీపీ అధినేత వైయస్ జగన్ మాట్లాడారు. మా దగ్గర హైకోర్టు ఉత్తర్వులున్నాయి, మీ దగ్గర ఏముందో చూపించాలంటూ చీఫ్ మార్షల్‌ను వైయస్ జగన్ డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తే మీరే ఇబ్బందుల్లో పడతారని కూడా సూచించారు.

స్పీకర్ చెప్పారని అనగా.. ఉత్తర్వుల కాపీ ఉంటే చూపించాలని అడిగారు. అయితే అందుకు చీఫ్ మార్షల్ మాట్లాడుతూ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని చెప్పారు. స్పీకర్ కార్యాలయం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే రోజాను అనుమతించేది లేదన్నారు. దీంతో ఈ విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే లోపలకు వెళ్తామని, అప్పటివరకు అంతా ఇక్కడే ఉంటామని గేట్ 2 వద్ద అందరూ ఆగిపోయారు. ఇదిలా ఉంటే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోడవంపై ఆమె తరుపు న్యాయవాది హైకోర్టులో ఇప్పటికిప్పుడే మరో పిటిషన్‌ను వేరే ఆలోచనలో ఉన్నారు.
ఈ మేరకు వైసీపీ అధినేత వైయస్ జగన్, రోజా తరుపు లాయర్‌తో మాట్లాడుతున్నారు. ఇది ఇలా ఉంటే మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అక్కడికి తెలంగాణ సీఎం, మంత్రులు చేరుకుంటుండటంతో రోజా అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications