ఏపీ కొత్త జిల్లాలపై టెన్షన్-నేడు తేల్చేయనున్న జగన్-రెండ్రోజుల్లో నోటిఫికేషన్

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరో రెండు రోజుల్లో నోటిపికేషన్ కూడా వెలువడబోతోంది. అయితే ఇప్పటికే పలు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో అభ్యంతరాలు వెల్లువెత్తడంతో వాటి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది స్పష్టం కాలేదు. ఇప్పటికే తనను కలిసిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ హామీలు ఇచ్చి పంపారు. అయితే అవన్నీ కార్యరూపం దాలుస్తాయా లేదా అన్న దానిపై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసింది.

కొత్త జిల్లాలపై టెన్షన్

కొత్త జిల్లాలపై టెన్షన్

ఏప్రిల్ 2 నుంచి ఉగాది నాడు ఎలాగైనా కొత్త జిల్లాల్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోందనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. ఎందుకంటే జిల్లాల పేర్లతో పాటు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలోనూ ఇప్పటికే వేలకొద్దీ అభ్యంతరాలు వచ్చాయి.వీటిలో చాలా మటుకు వైసీపీ నేతలు ఇచ్చిన అభ్యంతరాలే ఉన్నాయి. చాలా చోట్ల ప్రతిపక్షాలు కూడా ఉమ్మడిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విజ్ఞాపనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల వ్యవహారంలో జగన్ ఏం చేయబోతున్నారనే టెన్షన్ నెలకొంది.

నేడు జగన్ హైలెవల్ భేటీ

నేడు జగన్ హైలెవల్ భేటీ

కొత్త జిల్లాలపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో వాటిలో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించి సీఎం జగన్ ఇవాళ ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. ఇందులో పలువురు మంత్రులు, సలహాదారులు కూడా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో ఆయా ప్రాంతాలకు చెందిన నేతల్ని కూడా పిలిపించే అవకాశం ఉంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాసమున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు కోరుతున్న విధంగా మార్పులు చేర్పులు సాధ్యమవుతాయా లేదా అన్న అంశం ఇవాళ తేలిపోనుంది.

 రెండ్రోజుల్లో నోటిఫికేషన్

రెండ్రోజుల్లో నోటిఫికేషన్

ఇప్పటికే కొత్త జిల్లాలపై వ్యక్తమైన అభ్యంతరాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ ఇవాళ ఉన్నతస్ధాయి భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో శాస్త్రీయంగా అభ్యంతరాలు పరిశీలించి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై స్పష్టత ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత రెండురోజుల్లో అంటే ఉగాది ముందు రోజు కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో ఏయే మార్పులు ఉంటాయన్న దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈ నోటిఫికేషన్ ఇచ్చాక కూడా ఏం జరగబోతోందనే టెన్షన్ కూడా నెలకొంది. అందరినీ మెప్పించడం ఎలాగో సాధ్యం కాదనే విషయం ప్రభుత్వానికీ తెలుసు. కాబట్టి ఎక్కువగా అభ్యంతరాలు ఉన్న కొన్ని చోట్ల మాత్రమే మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+