ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది పాఠశాల బాలికలు అదృశ్యం... వీడిన మిస్టరీ
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దండేపల్లి కస్తూర్బా పాఠశాల నుంచి 11 మంది విద్యార్థినిల అదృశ్యంపై మిస్టరీ వీడింది. విద్యార్ధినిలకు సంబంధించి కొన్ని వస్తువులను పాఠశాల యాజమాన్యం బుధవారం కనుగొంది. దీంతో విద్యార్ధినిలు వాళ్ల స్వస్ధలమైన ఖానాపూర్ మండలం పెంబికు వెళ్లినట్లు గుర్తించారు.

దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్ధినులపై వాళ్ల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున యోగా సమయంలో విద్యార్థుల హాజరుపట్టిగా గమనించగా 11 మంది విద్యార్థినిల అదృశ్యమైనట్లు పాఠశాల యాజమాన్యం గుర్తించింది.
వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు నాలుగు బృందాలతో విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థినులంతా సమీప గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications