హిందూపురమే, ఆశించలేదు: మంత్రి పదవిపై బాలకృష్ణ

హైదరాబాద్/అనంతపురం: తనకు మంత్రి పదవి కంటే హిందూపురం అభివృద్ధే ముఖ్యమని హిందూపురం శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ మంగళవారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సేవామార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకే తాను మంత్రి పదవిని ఆశించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను 99వ చిత్రంలో నటిస్తున్నానని, వంద సినిమాలు పూర్తి చేస్తానని చెప్పారు. అభిమానులు జై బాలయ్య అంటూ నినదించారు.

జానా విందు

తెలంగాణ సీఎల్పీ నేత జానా రెడ్డి సోమవారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. నగరంలోని గోల్కొండ హోటల్‌లో ఈ విందు ఏర్పాటు చేశారు. దీనికి టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో పాటు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Hindupuram development is first: Balakrishna

తనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతగా జానా విందు ఇచ్చారని చెప్పుకుంటున్నప్పటికీ... అసలు విషయం వేరుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు సీఎల్పీ నేత జానా మిగతా ఎమ్మెల్యేలకు అందుబాటులోకి రాలేదన్న విమర్శలొచ్చాయి.

సీఎల్పీ నేతగా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాల్సి ఉండింది. అయితే జానారెడ్డి అలాంటి సమావేశాన్ని నిర్వహించకపోవడం, పైగా ఎమ్మెల్యేలతో కనీసం ఫోన్‌లోనైనా సంప్రదింపులు జరకపోవడంపట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలనుంచే అసంతృప్తి, అసహనం వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకే జానా విందు ఏర్పాటు చేశారని పార్టీ చేశారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+