వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు: వివాహానికి వెళ్తుండగా..: నాదీ బాధ్యత అంటూ..!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ హీరో..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చేదు అనుభవం ఎదురైంది. వివాహానికి హాజరయ్యేందుకు సొంత నియోజకవర్గానికి వచ్చిన బాలయ్యను స్థానికులు అడ్డుకున్నారు. టీడీపీ హాయంలో భూమి పూజ చేసి వదిలేసిన లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణను అడ్డుకున్న విద్యార్థులు, గ్రామస్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తరువాత బాలయ్య ఇచ్చిన హామీ మేరకు వారు అందోళన విరమించారు. ఆ తరువాత బాలయ్య వివాహానికి హాజరయ్యారు.

ఎమ్మెల్యేగా మమ్నల్ని పట్టించుకోరా
టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో రోడ్డు విస్తరణ కోసం శంకుస్థాపన చేసి వదిలేసిన పనులు పూర్తి చేయాలంటూ స్థానికులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాలకృష్ణ హిందూపురానికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు.

Hindupuram local people protest against MLA Balakrishna and stopped him to solve thier problems

లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు.

వివాహం కోసం వెళ్తుండగా..
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకోసం బాలకృష్ణ హిందూపురానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు.బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బాలకృష్ణ వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. సుదీర్ఘ గ్యాప్ తరువాత బాలకృష్ణ వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఎమ్మెల్యేను నిలదీసేందుకు కదలి వచ్చారు. చివరకు స్థానిక టీడీపీ నేతల సహకారంతో బాలకృష్ణ గ్రామస్తులను నచ్చ చెప్పారు. దీంతో వివాదం ముగిసింది.

English summary
Hindupuram local people protest against MLA Balakrishna and stopped him to solve thier problems. Balakrishna explained them and assure for clear the demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X