ఏ1గా చంద్రబాబు- చివరి నిమిషంలో మరో పేరు..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. తొలుత కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా.. ఆ తరువాత అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది.
పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అంగళ్లులో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నాయకులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన పోలీసులనూ వదల్లేదు. వారిపైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసుల వాహనాలనూ దగ్ధం చేశారు.

పుంగనూరులో చోటు చేసుకున్న అల్లర్లపై హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని అన్నారు. ముందుగా నిర్దేశించిన రూట్‌లో వెళ్లకుండా పుంగనూరులో దాడులు చేయడానికి తన మార్గాన్ని చంద్రబాబు మార్చుకున్నారని ఆరోపించారు.
రోడ్ షోలో పాల్గొనే వారికి బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలతో ఏం పని?, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. అల్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారంటూ విమర్శించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టేలా దూషించారని, అసభ్య పదజాలంతో ప్రసంగించారని తానేటి వనిత వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ తమ వద్ద ఉందని అన్నారు. ఈ కేసులో ఏ1 చంద్రబాబేనని పేర్కొన్నారు. టీడీపీ నేతలు చేసిన దాడిలో 50 మంది కార్యకర్తలు, 13 మంది పోలీసులు గాయపడ్డారని చెప్పారు.
ఈ కేసులో ఇప్పటివరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని తానేటి వనిత అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు.. రాజకీయ ప్రయోజనాల కోసం సాధారణ ప్రజలను రెచ్చగొడుతున్నాడని ధ్వజమెత్తారు.

కాగా- పుంగనూరులో విధ్వంసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడి పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబును గుర్తించామని ఎస్పీ రిషాంత్ తెలిపారు. ఆయనపై ఏ1గా కేసు పెట్టామని వివరించారు. ఇప్పటివరకు 50మందిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. వీడియో ఫుటేజీ ఆధారంగా మిగతావారిని గుర్తిస్తామని, ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications