నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం: ఊడి పడ్డ హోటల్ బోర్డు
Recommended Video

లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం...!! | Oneindia Telugu
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. ప్రచార కార్యక్రమాల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్, గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా పలువురు నాయకులు మంగళవారం రాత్రి నిడమర్రుకు వెళ్లారు.

అక్కడ సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద నిల్చుని ప్రసంగిస్తూ ఉండగా.. అదే హోటల్ పేరు రాసి ఉన్న బోర్డు ఆయనపై పడింది. లోకేష్ తో పాటు పక్కనే ఉన్న ఇతర నాయకులపైనా బోర్డు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు తగల్లేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా మారింది.












Click it and Unblock the Notifications