సన్నిహితుల ద్వారానే భాను పరిచయం, డబ్బు కోసమే సూరి హత్య: గంగుల హేమలత
అనంతపురం: అత్యంత సన్నిహితుల ద్వారానే భాను కిరణ్ మద్దెల చెర్వు సూరికి పరిచయమయ్యాడని సూరి సోదరి గంగుల హేమలత చెప్పారు. తన సోదరుడితో అత్యంత నమ్మకంగా ఉంటూనే హత్యకు పాల్పడ్డాడని భానుకిరణ్‌పై ఆరోపణలు గుప్పించారు.
Recommended Video

మద్దెల చెర్వు, పరిటాల రవి కుటుంబాలమ మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి. అయితే ఈ గొడవల నేపథ్యంలోనే రెండు కుటుంబాల మధ్య హత్యలు చోటుచేసుకొన్నాయని స్థానికులు చెబుతుంటారు.
అయితే మద్దెల చెర్వు సూరిని ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన భానుకిరణ్ హత్య చేశారని గంగుల హేమలత ఆరోపించారు. అనంతపురం పట్టణానికి చెందిన భాను కిరణ్ సన్నిహితుల ద్వారానే సూరికి పరిచయమయ్యారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను ప్రస్తావించారు.

సన్నిహితుల ద్వారానే భానుకిరణ్ పరిచయం
అత్యంత సన్నిహితుల ద్వారానే భానుకిరణ్ తన సోదరుడు మద్దెల చెర్వు సూరికి పరిచయమయ్యారని గంగుల హేమలత చెప్పారు. సూరికి నమ్మకస్తుడుగా ఉన్నాడని ఆమె చెప్పారు.అయితే డబ్బు కోసమే తన సోదరుడిని భాను కిరణ్ హత్య చేశారని ఆమె ఆరోపించారు.

అన్నతో పాటు చూశాను
అన్న సూరితో పాటు కొన్ని సార్లు భానుకిరణ్‌ను చూశానని గంగుల హేమలత చెప్పారు. కండిషన్ బెయిల్‌పై వచ్చిన సూరిని హైద్రాబాద్ లో కారులో భాను కిరణ్ హత్య చేశారని గంగుల హేమలత చెప్పారు. బెయిల్‌పై ఉన్న సమయంలో హైద్రాబాద్ వీడకూడదనేది షరతు ఉందని ఆమె గుర్గు చేశారు.

కాంట్రాక్టులు చేసేవాడు
మద్దెలచెర్వు సూరి కాంట్రాక్టులు చేసేవాడని ఆయన సోదరి గంగుల హేమలత గుర్తు చేశారు. పొలం మీద కూడ డబ్బులు వచ్చేవన్నారు. అయితే కాంట్రాక్టుల ద్వారా సంపాదించాడని హేమలత గుర్తు చేసుకొన్నారు.

సెటిల్ మెంట్లు చేసే విషయం తెలియదు
సూరి సెటిల్ మెంట్లు చేసే విషయం తనకు తెలియదని గంగుల హేమలత చెప్పారు. ఈ విషయమై ప్రచారం ఉందన్నారు. కానీ, కాంట్రాక్టులు చేసే విషయం తనకు తెలుసునని చెప్పారు. హంద్రీనీవా కాంట్రాక్టు పనులను సూరి చేశారని ఆమె గుర్గు చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications