వారంలో 5 ఛార్జీషీట్లా: జగన్ కేసులో సిబిఐపై యనమల

జగన్ బెయిల్ కోసమే తాజాగా హడావుడిగా ఐదు ఛార్జీషీట్లు వేశారని ఆరోపించారు. గతంలో ఐదు ఛార్జీషీట్లు వేసేందుకు అన్ని రోజులు తీసుకుంటే తాజా ఐదు ఛార్జీషీట్లను వారం రోజుల్లోనే ఎలా వేశారని ప్రశ్నించారు. జగన్ ఓ విషపు చేప అని ఆయన బయటకు వస్తే చాలా ప్రమాదమన్నారు.
జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుందన్నారు. అలాగే అతను జైలు నుండి బయటకు వస్తే సమాజాన్ని అవినీతి విషంతో నింపి వ్యవస్థలను అంతం చేస్తాడని ఆరోపించారు.
సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన తెలుగు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications