విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో చంద్రబాబు కొత్త గేమ్-సీఎం రమేష్ సాయం ? కేశినేని ఫ్రస్ట్రేషన్ ! సోదరుడికే టికెట్ !

|
Google Oneindia TeluguNews

కమ్మ సామాజిక వర్గ కోటగా పేరున్న విజయవాడ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అదే సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని రోజుకో రకంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇరుకునపెడుతున్నాయి. దీంతో విసుగెత్తిన చంద్రబాబు మొత్తం ప్లాన్ మార్చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు గతంలో తాను ఎంపీని చేశాక పార్టీ మారిన మరో నేత సాయం కూడా తీసుకున్నట్లు అర్ధమవుతోంది. ఇదంతా తెలిసి కేశినేనిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.

 బెజవాడలో టీడీపీ రాజకీయం

బెజవాడలో టీడీపీ రాజకీయం

రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో రాజకీయ చైతన్యం మాత్రమే కాదు కమ్మ సామాజిక వర్గ బలం, బలగం కూడా ఎక్కువే. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా విజయవాడలో మాత్రం టీడీపీ ఎంపీగా కేశినేని నాని గెలిచారు. దీంతో విజయవాడ వైసీపీకి మింగుడుపడలేదని అంతా భావించారు. కానీ స్ధానిక ఎన్నికలకు వచ్చే సరికి పరిస్ధితి మారిపోయింది. టీడీపీలో కేశినేని నానికి వ్యతిరేకంగా వర్గాలు తయారవడం, ఆధిపత్య పోరుతో టీడీపీ పరిస్ధితి దారుణంగా మారిపోయింది. అందునా మేయర్ గా పోటీ చేసిన కేశినేని నాని కుమార్తె శ్వేతకు నిరాశ తప్పలేదు. అప్పుడు మొదలైన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది.

కేశినేని డబుల్ గేమ్

కేశినేని డబుల్ గేమ్

స్ధానిక ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి తన కుమార్తె శ్వేత మేయర్ కాకుండా అడ్డుకున్న వైనం, దానికి అధిష్టానం నుంచి లభించిన మద్దతు సహజంగానే కేశినేనిలో ఫ్రస్ట్రేషన్ నింపాయి. దీంతో అప్పటి నుంచి అధిష్టానం వైఖరిపై ఆయన రగిలిపోతున్నారు. అలాగని కేశినేని టీడీపీనే నమ్ముకుని ఉండిపోతారా అంటే అదీ గ్యారంటీ లేదు. దీంతో కేశినేనిని అధిష్టానం కూడా నమ్మడం మానేసింది. చివరికి కేశినేని నాని సేఫ్ గేమ్ ఆడటం మొదలుపెట్టేశారు. బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం కూడా జరిగింది. అయినా తాజాగా రాష్ట్రపతి అభ్యర్ది ద్రౌపదీ ముర్ము విజయవాడ టూర్ లోనూ కేశినేని చురుగ్గానే కనిపించారు. తద్వారా టీడీపీని లీడ్ చేస్తున్నట్లు కనిపిస్తూనే, బీజేపీకి దగ్గరయ్యారు.

 కేశినేని చిన్ని ఎంట్రీ

కేశినేని చిన్ని ఎంట్రీ

తమ కంచుకోట విజయవాడలో అసలే ఇబ్బందులు ఎదుర్కొంటుున్న టీడీపీకి ప్లస్ కావాల్సిన ఎంపీ కేశినేని నాని మైనస్ కావడంతో చంద్రబాబు ప్లాన్ మార్చేశారు. పార్టీలో ఉంటారో లేదో తెలియని కేశినేని నానిని పక్కనబెట్టి, ఆయన సోదరుడు, గతంలో కేశినేని విజయంలో కీలకపాత్ర పోషించిన కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తాజాగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం గేమ్ మారిపోయింది. నానిలో ఫ్రస్ట్రేషన్ పీక్ కు చేరుకుంది.

ఫ్రస్ట్రేషన్ లో నాని షాకింగ్ కామెంట్స్

ఫ్రస్ట్రేషన్ లో నాని షాకింగ్ కామెంట్స్

ఓవైపు స్ధానికంగా పార్టీ నేతల నుంచి సహకారం కరవవడం, అదే సమయంలో తనకు సహకరించాల్సిన అధిష్టానం తన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తుండటంతో కేశినేని నానిలో ఫ్రస్ట్రేషన్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో నిన్న ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన నాని.. టీడీపీ మరోసారి గెలవడం కష్టమని, చంద్రబాబుకు గెలిపించే శక్తియుక్తులు లేవంటూ రెచ్చిపోయారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అదే సమయంలో తన స్ధానంలో కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాల వెనుక ఒకప్పటి తన సహచరుడు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడని భావిస్తున్న కేశినేని నాని, ఆయన మరో షిండే అవుతారంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

కేశినేనికి చెక్ పెట్టేసిన చంద్రబాబు ?

కేశినేనికి చెక్ పెట్టేసిన చంద్రబాబు ?


తాజాగా కొన్ని సందర్భాలలో నాని.. టీడీపీలో కొన్ని గ్రూపులను ప్రోత్సహిస్తుండడంతో నానికి చెక్ పెట్టేందుకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నానికి బదులుగా చిన్నిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని కొంతమంది నాయకుల ద్వారా తెలుసుకున్న నాని...ఆగ్రహంతో ఊగిపోతున్నారట. చిన్ని ఇప్పటికే కొంతమందితో పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వే చేయించుకున్నట్లు... అంతర్గత సమాచారం. ఢిల్లీలో నాని చంద్రబాబు పై చేసిన తాజా వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అదే జరిగితే నాని ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.

English summary
vijayawada tdp sitting mp kesineni nani's recent comments on party and high command create treamours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X