YS Sharmila: అన్న బాటలోనే షర్మిల! చంద్రబాబును కొట్టిన ఆ స్ట్రాటజీతోనే?
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో గతంలో వర్కవుట్ అయిన సక్సెస్ ఫుల్ వ్యూహాలపైనా దృష్టిపెడుతున్నాయి. అలాంటిదే ఓ వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కూడా అమల్లో పెడుతున్నారు. గతంలో తన అన్న వైఎస్ జగన్ చంద్రబాబును గద్దె దింపేందుకు అనుసరించిన ఈ వ్యూహం ఇప్పుడు షర్మిలకు ఎంత వరకూ పనికొస్తుందో చూడాలి మరి.
Recommended Video

గతంలో 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు పరిస్ధితుల్ని గమనిస్తే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ.. ప్రత్యేక హోదా సహా విభజన హామీల్ని అమలు చేయించడంలో తడబడుతోంది. ఇదే అదనుగా చంద్రబాబును గద్దె దింపేందుకు ఇదే సరైన సమయం అని భావించిన జగన్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని విద్యార్ధులు, యువత, సాధారణ జనంలోకి భారీగా తీసుకెళ్లారు.

దీంతో చంద్రబాబుపై ఒత్తిడి అమాంతం పెరిగింది. చివరకు ఎన్డీయే సర్కార్ నుంచి తమ మంత్రుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు బీజేపీతో బంధాన్ని ఆయన కటీఫ్ చేసుకున్నారు. అయినా చంద్రబాబును వదలకుండా టార్గెట్ చేస్తుండటంతో చివరికి అన్నింటికీ తెగించి ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు జాతీయ స్ధాయి నేతల్ని కూడగట్టారు. చివరికి బీజేపీకి టార్గెట్ గా మారిపోయి పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు ఇదే వ్యూహం అనుసరించి అన్న జగన్ పై ఒత్తిడి పెంచేందుకు షర్మిల సిద్దమవుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా పై తొలి సంతకం పెడతానని స్వయంగా ప్రకటించినా నమ్మని ఏపీ ఓటర్లను నమ్మించేందుకు షర్మిల ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల్ని అమలు చేయని బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారని అన్న జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇవే అంశాలు జనంలోకి వెళ్లి చర్చ మొదలైతే కచ్చితంగా బీజేపీతో జగన్ కు గ్యాప్ పెరుగుతుందని షర్మిల అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలో షర్మిల వ్యూహం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో తెలియని పరిస్ధితి.












Click it and Unblock the Notifications