జగన్ ను ఓడించింది ప్రశాంత్ కిషోరే - చంద్రబాబు చేతికి బ్రహ్మాస్తం..!!
ఏపీలో జగన్ భారీ పరాజయం పాలయ్యారు. ఖాయంగా గెలుస్తాననే జగన్ లెక్కలు చివరి 10 రోజుల్లో మారిపోయాయి. కూటమి నేతలు సైతం అంచనా వేయని విధంగా జగన్ ఓడిపోయారు. కానీ, జగన్ కు భారీ పరాజయం తప్పదని ప్రశాంత్ కిశోర్ ముందుగానే చెప్పారు. దీనిని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ప్రచారం మరి కొద్ది రోజుల్లో ముగుస్తుందనే సమయంలో చంద్రబాబు చేతికి ప్రశాంత్ కిషోర్ బ్రహ్మాస్త్రం అందించారు. అదే జగన్ ను ఓడించటానికి కారణమైంది.
చంద్రబాబు కోసం పీకే
కూటమిగా జత కట్టినా..జగన్ ను ఓడించే లక్ష్యంతో చంద్రబాబు ఏ ఒక్క అవకాశం వదులుకో లేదు. 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తో టచ్ లోకి వెళ్లారు. తొలుత ఆయన నో చెప్పినా..కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒప్పించారు. తన ఇంటికి రప్పించారు. తన గెలుపుకు ప్రత్యక్షంగా పని చేయలేకపోయినా..సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు...కూటమి పొత్తుల లెక్కల పైన పూర్తిగా అధ్యయనం చేసారు. ప్రచారం ప్రారంభమైన తరువాత హైదరాబాద్ లోనే పీకే మకాం వేసారు.

వ్యూహాత్మక అంశాలతో
జగన్ కు మాస్, గ్రామీణ ఓటర్లతో ఉన్న బంధం..మద్దతు గుర్తించారు. అక్కడ బ్రేక్ వేస్తేనే జగన్ ను ఓడించగలమని గుర్తించారు. దీంతో..జగన్ తన పాలనలో తీసుకున్న నిర్ణయాలను అధ్యయనం చేసారు. అందులో లాండ్ టైటిల్ యాక్ట్ గుర్తించారు. ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా ఎలా మలచుకోవచ్చో ఆలోచించారు. అప్పటికే కొందరు న్యాయవాదులు ఈ చట్టం పైన చేసిన అభ్యంతరాల పైన సమాచారం సేకరించారు. అయితే, ఈ చట్టం నీతి అయోగ్ సిఫార్సుల మేరకు చేసిన చట్టం కావటంతో జగన్ కు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేయాలనే అంశం పైన తర్జన భర్జన పడ్డారు. దీంతో..ఎక్కడా కేంద్రం పేరు ప్రస్తావన తేకుండా..జగన్ తెచ్చిన చట్టంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
పీకే అంచనా సక్సెస్
అదే విధంగా పట్టాల పైన జగన్ బొమ్మ ముద్రించటంతో మరింత అనుకూలంగా మలచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ముప్పు ఉంటుందని వైసీపీ అంచనా వేసింది. జగన్ కొన్ని సభల్లో ఈ చట్టం పైన చేస్తున్న ప్రచారానికి సమాధానం ఇచ్చారు. జగన్ సమాధానం..తిప్పి కొట్టే విధంగా పరిమితం కావటం..పార్టీ ముఖ్యులు పెద్దగా దీనిని కౌంటర్ చేయటంలో ఫోకస్ చేయకపోవటం నష్టం చేసింది. ఈ చట్టం పైన గ్రామీణ స్థాయిలో వస్తున్న స్పందన పైన పీకే ఆరా తీసారు. మరింత తీవ్రత పెంచాలని సూచించారు. చివరి రోజు వరకు చంద్రబాబు ఈ చట్టం ప్రతులను జనం ముందు దగ్గం చేస్తూ..ఈ చట్టం ద్వారా జగన్ సామాన్యుల భూములు లాగేసుకుంటారని ప్రచారం చేసారు. పోలింగ్ తరువాత చేసిన సర్వేల్లోనూ వ్యతిరేక ఓటులో ఇదే అంశం ప్రధానంగా ప్రభావం చూపినట్లు గుర్తించారు. అంతే పీకే చెప్పినట్లుగా జగన్ ఓడిపోయారు. చంద్రబాబు విజయం సాధించారు.












Click it and Unblock the Notifications