రిజర్వేషన్ టికెట్ లేకపోయినా ప్రయాణించవచ్చు
భారతీయ రైల్వే ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగివున్న కంపెనీగా పేరు పొందడమేకాదు.. అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న దేశాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో ప్రయాణికులకు ఆకట్టుకుంటూ, వారి సౌకర్యాలకు పెద్ద పీట వేస్తూ దూసుకోపోతోంది.
భారతీయుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేస్తుంటారు. కొందరు ప్రతిరోజు రైళ్లల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. రైలులో ప్రయాణించాలంటే కొద్దిరోజులు ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటాం. అయితే ఒక్కోసారి అకస్మాత్తుగా ప్రయాణించాల్సి రావచ్చు. అటువంటి సమయంలో రిజర్వేషన్ దొరక్క ఎంతో ఇబ్బంది పడతాం. రిజర్వేషన్ టికెట్ లేకపోయినా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులువుగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా చేరుకోవచ్చు.

ప్లాట్ ఫారం టికెట్ తో ప్రయాణం చేయవచ్చు. అయితే రైలు ఎక్కిన తర్వాత టికెట్ కలెక్టర్ ను (TTE) సంప్రదించాలి. ఎటువంటి కంగారు లేకుండా టీటీఈని కలిసి తాను ఎక్కడివరకు ప్రయాణం చేయాలనుకుంటున్నాడో అక్కడి వరకు అయ్యే డబ్బును చెల్లించి అతని దగ్గర రశీదును పొందాలి. రైలులో ఒకోసారి రద్దీ ఎక్కువగా ఉంటే బెర్త్ కాదు.. కూర్చోవడానికి సీటు కూడా కేటాయించరు. అటువంటి సమయంలో మాత్రమే టీటీఈ ప్రయాణికుడికి రిజర్వు సీటు ఇవ్వలేరు. ఆ సమయంలో రిజర్వేషన్ బోగీలో ప్రయాణించాలనుకుంటే రూ.250 అపరాధ రుసుముతోపాటు ప్రయాణ ఛార్జీని కూడా చెల్లించి ప్రయాణించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications