సంక్రాంతికి ముందు బంగారం ధరల బిగ్ రిలీఫ్.. పండుగలాంటి వార్త!

పసిడి ప్రియులు 2025 సంవత్సరం పైన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి కొద్దిగా పరుగులు పెట్టిన పసిడి గత రెండు మూడు రోజులుగా మళ్లీ శాంతించింది. ఇక గత మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటం బంగారం ప్రియులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

స్థిరంగా బంగారం ధరలు
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ బంగారం ధరలు తగ్గడం, పసిడి దూకుడు తగ్గించి కొద్దిగా స్థిరంగా ఉండడం మహిళలు బంగారం షాపుల వంక చూసేలా చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 7215 రూపాయలు కాగా, 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 7871 రూపాయలుగా ఉంది.

Huge fall in gold prices before sankranti these are the Gold prices in telugu states today

నేడు బంగారం ధరలు ఇలా
ప్రస్తుతం భారతదేశంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 72,150 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78,710 గా ఉంది. నిన్న కూడా ఇవే ధరలు కొనసాగడంతో బంగారం ధరలు స్థిరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది . అయితే బంగారం ప్రియులు మాత్రం ధరలు ఇంకాస్త తగ్గితే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఏపీ, తెలంగాణాలలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా
ఇదిలా ఉంటే నేడు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 72, 150 రూపాయలు గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78,710 గాను ఉంది. ఇక విజయవాడ విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 72 వేల 150 రూపాయలు గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78,710 గాను ఉంది.

2024లో బంగారం కొన్నవారికి జాక్ పాట్
ఇదిలా ఉంటే వెండి ధరల్లో ఈ సంవత్సరం పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెండి ధర కిలోకు లక్ష రూపాయలు పలుకుతుంది. ఇదిలా ఉంటే 2024 సంవత్సరంలో ఎవరైతే బంగారం మీద పెట్టుబడులు పెట్టారో వారు ఊహించని జాక్పాట్ కొట్టారు. ఏకంగా 2024 సంవత్సరంలో 30% మేర బంగారం ధర పెరిగింది.

ఈ ఏడాది అంచనా ఇదే
ఇక ఈ సంవత్సరం కూడా బంగారం ధర బాగా పెరుగుతుందని, బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బంగారం కొనుగోలు చేయాలనుకునే బంగారం ప్రియులు మాత్రం కాస్త ధరల దూకుడు తగ్గితే కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+